హాయ్‌ నాన్న.. ఇంకా బ్రేక్ ఈవెన్ కాలేదా?

నాని ( nani )హీరో గా మృణాల్ హీరోయిన్ గా రూపొందిన హాయ్ నాన్న( hi nanna ) చిత్రం గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఈ సినిమా కు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.

 Nani, Mrunal Thakur Hi Nanna Movie Collections , Nani, Mrunal Thakur , Hi Nann-TeluguStop.com

అయితే సినిమా కు బ్రేక్ ఈవెన్‌ ఇంకా కాలేదని బాక్సాఫీస్ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.హాయ్‌ నాన్న సినిమా ఓవర్సీస్ లో 1.5 మిలియన్ డాలర్లను వసూళ్లు చేసింది.భారీ అంచనాల నడుమ రూపొందిన హాయ్ నాన్న సినిమా యూఎస్ లో బ్రేక్‌ ఈవెన్ కి చేరింది.

ఈ వీకెండ్‌ లో వచ్చే వసూళ్లు మొత్తం కూడా లాభాలే అంటూ యూనిట్‌ సభ్యుల ద్వారా సమాచారం అందుతోంది.ఇక హాయ్ నాన్న తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ కి చేరువ అవ్వాల్సి ఉంది.విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం సినిమా దాదాపుగా బ్రేక్ ఈవెన్ కి చేరువ అయింది.అయితే సినిమా విడుదల సమయంలో తుఫాన్‌ కారణం గా మొదటి రెండు మూడు రోజులు ఆశించిన స్థాయి లో వసూళ్లు నమోదు అవ్వలేదు.

అందుకే బ్రేక్ ఈవెన్ ఆలస్యం అయింది.సలార్‌ వచ్చే వరకు హాయ్ నాన్న సందడి కొనసాగబోతుంది.

కనుక అప్పటి వరకు ఈజీగా బ్రేక్ ఈవెన్‌ ను సాధించి అంతే కాకుండా బయ్యర్లకు మంచి లాభాలను కూడా తెచ్చి పెట్టే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.హాయ్ నాన్న సినిమా లో తండ్రి కూతురు సెంటిమెంట్ తో పాటు అన్ని విషయాల పట్ల ప్రేక్షకులు చాలా ఆసక్తిని కనబర్చుతున్నారు.నాని ఇలాంటి పాత్ర లను అద్భుతంగా పోషిస్తాడు అంటూ మరోసారి నిరూపితం అయింది అంటూ హాయ్ నాన్న సినిమా ఫలితం తో తేలిందని ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube