హమాస్ బందీగా తీసుకెళ్లిన 27 ఏళ్ల ఇజ్రాయెల్ యువతి మృతి..

27 ఏళ్ల ఇజ్రాయెలీ మహిళ ఇన్బార్ హైమాన్ ( Inbar Hyman )అత్యంత దారుణంగా హత్యకు గురైందని తాజాగా అధికారులు వెల్లడించారు.ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (IDF) ప్రకారం, ఆమెను అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌లో ఒక మ్యూజికల్ ఫెస్టివల్ నుంచి హమాస్ మిలిటెంట్లు కిడ్నాప్ చేసి తర్వాత బంధించారు.

 A 27-year-old Israeli Woman Who Was Taken Hostage By Hamas Has Died, Inbar Haima-TeluguStop.com

ఆమెను వదిలేస్తారేమో అని కుటుంబ సభ్యులు ఆశించారు కానీ చివరికి ఆ కిరాతకులు చంపేశారు.బందీ, మిస్సింగ్ ఫ్యామిలీస్ ఫోరమ్‌లో సభ్యులుగా ఉన్న ఆమె కుటుంబానికి హైమాన్ మరణాన్ని IDF కన్ఫామ్ చేసింది.

ఫోరమ్ అనేది శత్రు భూభాగంలో పట్టుబడిన లేదా తప్పిపోయిన ఇజ్రాయెల్‌ల( Israel ) బంధువులకు మద్దతు ఇచ్చే సంస్థ.ఈ ఫోరమ్ ఆ చేదు నిజం బయట పెట్టడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు.

ఫోరమ్ ఫేస్‌బుక్‌లో హైమాన్‌కు నివాళిని పోస్ట్ చేసింది, ఆమెను ” టాలెంటెడ్ క్రియేటివ్ గర్ల్‌” ( Talented Creative Girl )అని అభివర్ణించింది.ఆర్ట్, గ్రాఫిటీ, ఫిల్మ్ మేకింగ్ పట్ల ఆమెకున్న అభిరుచి గురించి కూడా ఈ పోస్ట్ వివరించింది.మక్కాబి హైఫా సాకర్ టీమ్‌కు ఆమె ఎంతో సపోర్ట్ చేసేదని వెల్లడించింది.విజువల్ కమ్యూనికేషన్ చదువుతున్నప్పుడు కలిసిన తన పార్ట్‌నర్ నోమ్ అలోన్‌తో ఆమె బ్యూటిఫుల్ లైఫ్ సాగించిందని కూడా తెలిపింది.

అక్టోబరు 7న జరిగిన భారీ హమాస్( Hamas) దాడి బాధితుల్లో హైమాన్ ఒకరు, ఇది ఇజ్రాయెల్‌లోని పలు ప్రదేశాలను లక్ష్యంగా చేసుకుంది, ఇందులో ఆమె స్వచ్ఛందంగా పనిచేస్తున్న సూపర్‌నోవా మ్యూజిక్ ఫెస్టివల్ కూడా ఉంది.ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో పాటు పేలుడు పదార్థాలు పేల్చడంతో ఉత్సవంలో ఉన్న వందలాది మంది ప్రజలు సురక్షిత ప్రాంతాలకు పారిపోయేందుకు ప్రయత్నించారు.హైమాన్, ఆమె ఇద్దరు స్నేహితులు వారి కారు వైపు పరిగెత్తారు, కానీ ఆమెను మోటర్‌బైక్‌లపై ఉన్న ఇద్దరు హమాస్ కార్యకర్తలు పట్టుకున్నారు, వారు ఆమెను లాగారు.ఆమె అపహరణకు సంబంధించిన వీడియో ఆన్‌లైన్‌లో ప్రసారం చేయబడింది, ఇది ఆగ్రహం, ఆందోళనకు దారితీసింది.

ఈ సంఘటనను చూసిన ఆమె ప్రియుడు అలోన్ ఆమె ప్రాణాలను కాపాడాలని, ఆమెతో మానవత్వంతో ప్రవర్తించాలని కిడ్నాపర్‌లను విజ్ఞప్తి చేశాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube