తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు సంచలనంగా మారుతున్నాయి.ఆల్రెడీ ప్రభుత్వ సలహాదారులను, కార్పొరేషన్ చైర్మన్ నియామకాలను రద్దు చేయడం జరిగింది.
TSPSC కి సంబంధించి ప్రక్షాళన కార్యక్రమం చేపడుతున్నారు.ఇదిలా ఉంటే ఇప్పుడు తాజాగా మాజీ ఎమ్మెల్యేలు, మంత్రులకు భద్రతను తొలగిస్తూ ఆదేశాలు జారీ చేయడం జరిగింది.
దీంతో పోలీస్ శాఖ వారి గన్ మెన్స్ నీ విత్ డ్రా చేసుకుంది.ఇదే సమయంలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలకు… తెలంగాణ పోలీసు శాఖ భద్రత కల్పించడం జరిగింది.
కాగా ఎంసిహెచ్ఆర్డిలో ఉన్న ఖాళీ స్థలంలో ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్ నిర్మాణం చేపట్టడానికి కూడా రెడీ అవుతున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
గురువారం పలుకీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది.ఈ క్రమంలో పలువురు మంత్రులకు బంగ్లాల కేటాయింపు ఇంకా శాసనసభ, శాసనమండలి సమావేశాల నిర్వహణపై చర్చించారు.పాత అసెంబ్లీ భవనంలో కౌన్సిల్ సమావేశాలు ఉంటాయని ప్రస్తుతం ఉన్న అసెంబ్లీలోనే శాసనసభ జరుగుతుందని పేర్కొన్నారు.
పార్లమెంట్ తరహాలో అసెంబ్లీ ఉండనుందన్నారు.ప్రజా భవన్ లో ఇంకో భవనం ఉందని… దానిని మరో మంత్రికి ఇస్తామని పేర్కొన్నారు.
ఒకపక్క పాలన పరంగా ప్రక్షాళన మరోపక్క నెలకొన్న ప్రభుత్వాన్ని .బలోపేతం దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు.తెలంగాణ రాజకీయాలలో సంచలనంగా మారుతున్నాయి.