రేవంత్ తొలి సంతకం దీనిపైనే ! ఏడాదికి లక్ష కోట్లు ఖర్చు

తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి( Revanth Reddy ) రేపు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.ఎన్నో ఉత్కంఠ పరిణామాల మధ్య రేవంత్ పేరును కాంగ్రెస్ అధిష్టానం ఫైనల్ చేసింది.

 Revanth Reddy First Signature As Cm Will Be On The Six Guarantee File Details, R-TeluguStop.com

ఇక రేవంత్ తెలంగాణ ముఖ్యమంత్రిగా( Telangana CM ) బాధ్యతలు స్వీకరించిన తర్వాత మంత్రిమండలి కొలువు తీరనుంది.ఎవరెవరు మంత్రులు కాబోతున్నారు అనేది సర్వత్ర ఆసక్తి నెలకొంది.

ఇప్పటికే అనేక విజ్ఞప్తులు రేవంత్ తో పాటు కాంగ్రెస్ అధిష్టానానికి వెళ్లాయి.ఇక ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి తొలి సంతకం కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీ పథకాలు అమలుపైనే చేయనున్నారు.

ఇప్పటికే మంత్రి మండలి ఏర్పాటు పైన ఎవరెవరిని మంత్రివర్గంలోకి తీసుకోవాలని దానిపైన కాంగ్రెస్ అధిష్టానం తో రేవంత్ చర్చించారు.దాదాపు లిస్టు కూడా ఫైనల్ అయినట్లు తెలుస్తోంది.

  అలాగే ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీ స్థానాల భర్తీకి రేవంత్ ఏర్పాట్లు చేస్తున్నారు. పార్టీ అగ్రనేతలు,  అతిధులు,  కొత్త మంత్రులు, పార్టీ కీలక నాయకుల సమక్షంలో ఆరు గ్యారెంటీ పథకాలు( Six Guarantees Schemes ) అమలుపై రేవంత్ తొలి సంతకం చేయనున్నారు.

ఈనెల తొమ్మిదో తేదీన మంత్రివర్గ సమావేశంలో ఈ పథకాల అమలు తీరును రేవంత్ ఖరారు చేయనున్నారు.

Telugu Aicc, Congress, Pcc, Revanth Reddy, Revanthreddy, Telangana Cm, Telangana

ఎన్నికల ప్రచార సమయంలో కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీ పథకాలు తీవ్రంగా ప్రభావం చూపించాయి.కాంగ్రెస్ గెలుపునకు ఎంతగానో దోహదం చేశాయి .దీంతో ఈ పథకాన్ని కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.  దీనిని సమర్థవంతంగా అమలు చేయాలని రేవంత్ భావిస్తున్నారు.అయితే ఈ గ్యారెంటీల అమలుకు ఏడాదికి లక్ష కోట్ల రూపాయల వరకు ఖర్చు పెట్టాల్సి ఉంది.దీంతో ఈ పథకం అమలుకు నిధుల సమస్య ఏర్పడకుండా చూడడం రేవంత్ కు పెద్ద సవాల్ గానే ఉండబోతోంది.

Telugu Aicc, Congress, Pcc, Revanth Reddy, Revanthreddy, Telangana Cm, Telangana

ప్రస్తుతం తెలంగాణ ఆర్థిక పరిస్థితులు ఇవన్నీ రేవంత్ కు ఇబ్బంది కలిగించే అంశాలే.ఇక ఎమ్మెల్సీ స్థానాల భర్తీపైన( MLC Seats ) రేవంత్ దృష్టిపెట్టనున్నారు.4 ఎమ్మెల్సీ పదవులు సిద్ధంగా ఉన్నాయి.రెండు గవర్నర్ కోటాలో కాగా,  మరో రెండు ఎమ్మెల్యే కోటాలో భర్తీ కానున్నాయి.దీంతో ఈ ఎమ్మెల్సీ పదవుల పైన చాలామంది నేతలే ఆశలు పెట్టుకున్నారు.అయితే సిపిఐ కి పొత్తులో భాగంగా 2 ఎమ్మెల్సీలు ఇస్తామని కాంగ్రెస్ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది.దీంతో కాంగ్రెస్ ఇచ్చే రెండు ఎమ్మెల్సీ సీట్లపై సిపిఐ భారీగానే ఆశలు పెట్టుకుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube