తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉండే చాలా మంది డైరెక్టర్లు వాళ్ళకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోవడానికి అహర్నిశలు కష్టపడుతూ ఉంటారు.ఇక ఇలాంటి క్రమంలోనే కొంతమంది డైరెక్టర్లు వరుసగా సినిమాలు చేస్తూ సక్సెస్ లను అందుకుంటూ ఉంటారు.
కానీ మరి కొంతమంది మాత్రం ఎన్ని సినిమాలు చేసినా కూడా ఫెయిల్యూర్ అనేటివి వస్తూ ఇండస్ట్రీలో ఎదగలేక డీలాపడిపోతూ ఉంటారు.ఇక ఇలాంటి వారు ఒక్క హిట్టు కొట్టడానికి చాలా సంవత్సరాల పాటు ఎదురు చూడాల్సి వస్తుంది.
ఇక అందులో భాగంగానే ఇండస్ట్రీలో కొంతమంది డైరెక్టర్లకి ఒక స్టైల్ అనేది ఉంటుంది.వాళ్లు ఆ స్టైల్ లోనే సినిమాలు చేసి సక్సెస్ ని అందుకుంటుంటారు.ఇక ఇండస్ట్రీ అలాంటి స్టైల్ ఏదీ లేకుండా సినిమాలు తీసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు…ఇక ఇది ఇలా ఉంటే బోయపాటి శ్రీను( Boyapati Srinu ) ఇండస్ట్రీ లో ఒక మాస్ డైరెక్టర్ గా గుర్తింపు పొందాడు ఇక ఇప్పుడు బాలయ్య బాబుతో ఒక సినిమా ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది.
ఇంతకుముందు తను హీరో రామ్ తో స్కంద( Skanda ) అనే సినిమాతో చేసినప్పటికీ ఆ సినిమా ఆశించిన విజయాన్ని అందించలేదు.ఇక దాంతో ఆయన బాలయ్య బాబుతో సినిమా చేసి మరో బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టాలని చూస్తున్నాడు.ఇక అందులో భాగంగానే వీళ్ళ కాంబినేషన్ లో వచ్చిన మూడు సినిమాలు సూపర్ హిట్స్ అవ్వగా ఇప్పుడు నాలుగో సినిమాగా మరో సినిమా తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
ఇక ఈ సినిమా మీద అటు నందమూరి అభిమానులతో పాటు ఇటు బోయపాటి ఫ్యాన్స్ కూడా మంచి అంచనాలు పెట్టుకున్నారు…ఇక ఈ సినిమా తో కనక మరోసారి బోయపాటి హిట్ కొడితే ఇక బాలయ్య బోయపాటి( Balayya Boyapati ) కాంబో హిస్టరీ లో నిలిచిపోతుంది…
.