ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడిలో ఓట్ల అవకతవకలపై టీడీపీ అవగాహన కార్యక్రమం జరిగింది.ఈ కార్యక్రమంలో పాల్గొన్న దేవినేని ఉమ సీఎం జగన్ నాయకత్వంలోనే ఓటర్ లిస్టులో అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపించారు.
పింగళి వెంకయ్య కుటుంబ సభ్యుల ఓట్లను తీసేశారని దేవినేని మండిపడ్డారు.ఓటర్ లిస్టులో భారీగా దొంగ ఓట్లను చేర్చారన్న ఆయన టీడీపీ సానుభూతిపరుల ఓట్లను తొలగిస్తున్నారని చెప్పారు.
దీనిపై అధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవడం లేదని పేర్కొన్నారు.ఈ తప్పుడు పనులను అజేయకల్లం ప్రోత్సహిస్తున్నారని దేవినేని ఆరోపణలు చేశారు.
ఈ క్రమంలో తొలగించిన ఓట్లను చేర్చి దొంగ ఓట్లను తొలగించాలని డిమాండ్ చేశారు.