గుడ్డు.( Egg ).శాఖాహారమా లేక మాంసాహారమా అన్నది పక్కన పెడితే ఆరోగ్యానికి మాత్రం ఎంతో మేలు చేస్తుంది.రోజుకు ఒక ఉడికించిన గుడ్డు తింటే ఎన్నో రోగాలకు దూరంగా ఉండవచ్చని ఆరోగ్యాన్ని నిపుణులు చెబుతుంటారు.
అది అక్షరాల సత్యం.అయితే పోషకాల నిలయమైన గుడ్డు ఆరోగ్యానికే కాదు అందాన్ని పెంచడానికి కూడా సహాయపడుతుంది.
ముఖ్యంగా మీ చర్మాన్ని వైట్ గా, టైట్ గా మార్చడానికి గుడ్డు అద్భుతంగా హెల్ప్ చేస్తుంది.మరి ఇంతకీ చర్మానికి గుడ్డును ఎలా వాడాలి అన్నది ఇప్పుడు కలుసుకుందాం.
ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు శనగపిండి వేసుకోవాలి.అలాగే వన్ టేబుల్ స్పూన్ ముల్తాని మట్టి,( Multani soil ) రెండు టేబుల్ స్పూన్లు పచ్చి పాలు ( Milk )వేసుకొని బాగా కలుపుకోవాలి.చివరిగా ఒక ఎగ్ తీసుకుని బ్రేక్ చేసి వైట్ ను మాత్రం బౌల్ లో వేసుకోవాలి.ఆపై స్పూన్ తో అన్నీ కలిసేలా మరోసారి మిక్స్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి పూతలా అప్లై చేసుకుని ఇరవై నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.అనంతరం గోరువెచ్చని నీటితో చర్మాన్ని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.
వారానికి కేవలం రెండు సార్లు ఈ సింపుల్ అండ్ పవర్ ఫుల్ రెమెడీని కనుక పాటిస్తే మీ ముఖ చర్మం పై ఎలాంటి ముడతలు ఉన్న మాయం అవుతాయి.స్కిన్ టైట్ గా మారుతుంది.
స్కిన్ వైట్నింగ్ కి కూడా ఈ రెమెడీ ఎంతో ఉత్తమంగా సహాయపడుతుంది.అవును వారానికి కనీసం రెండు సార్లు ఈ ప్యాక్ వేసుకోవడం వల్ల చర్మం తెల్లగా మారుతుంది.కాంతివంతంగా మెరుస్తుంది.మరియు డ్రై స్కిన్( Dry skin ) తో బాధపడే వారు కూడా ఈ రెమెడీని ట్రై చేయవచ్చు.చర్మాన్ని ఈ రెమెడీ తేమగా ఉంచుతుంది.ఆకర్షణీయంగా మెరిపిస్తుంది.
కాబట్టి తప్పకుండా ప్రయత్నించండి.