బాలీవుడ్ లో 2023 కి రూ.625 కోట్ల వరకు సంపదతో రిచెస్ట్ హీరోయిన్లుగా నిలుస్తున్న వారు వీరే...

బాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్లు బాగానే పారితోషికం పుచ్చుకుంటారు.ఈ ఇండస్ట్రీలో సక్సెస్ అయితే కుర్ర హీరోయిన్లు కూడా తక్కువ కాలంలోనే వందల కోట్ల ఆస్తితో కోటీశ్వరులవుతారు.

 Bollywood 2023 Rich Heroines , Bollywood , Aishwarya Rai , Alia Bhatt ,priyan-TeluguStop.com

కొన్ని మీడియా రిపోర్ట్స్ ప్రకారం, ప్రస్తుతం హిందీ సినిమా పరిశ్రమలో పదిమంది మోస్ట్ రిచెస్ట్ హీరోయిన్లుగా నిలుస్తున్నారు.వారెవరో ఇప్పుడు తెలుసుకుందాం.

1.గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా 75 మిలియన్ల డాలర్ల (దాదాపు రూ.625 కోట్లు) ఆస్తితో అందరిలో కంటే తానే అత్యంత ధనవంతురాలుగా నిలుస్తోంది.

2.ఒక్క బాలీవుడ్ కే పరిమితం కాకుండా హాలీవుడ్ లో కూడా నటించి మెప్పించిన దీపికా పడుకొనే(Deepika Padukone ) 60 మిలియన్ల డాలర్ల (రూ.500 కోట్లు) నికర సంపాదన కలిగి ఉంది.

3.మల్లీశ్వరి హీరోయిన్ కత్రినా కైఫ్ కూడా 60 మిలియన్ల డాలర్ల (రూ.500 కోట్లు) ఆస్తి సంపాదించి బాలీవుడ్ రిచెస్ట్ హీరోయిన్లలో ఒకరిగా నిలుస్తోంది.

4.ప్రపంచంలోనే అత్యంత అందగత్తెలలో ఒకరిగా నిలిచే ఐశ్వర్య రాయ్‌ నెట్ వర్త్ 35 మిలియన్ల డాలర్లు (దాదాపు రూ.281 కోట్లు).

5.స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ వైఫ్ అనుష్క శర్మ కూడా 35 మిలియన్ల డాలర్లు (దాదాపు రూ.281 కోట్లు) సంపాదించింది.

Telugu Aishwarya Rai, Alia Bhatt, Bollywood, Anushka Sharma, Kajol, Priyanka Cho

6.బాలీవుడ్ అందగత్తె మాధురి దీక్షిత్ రూ.34 మిలియన్ల డాలర్లు సంపాదించింది.అంటే మన డబ్బుల్లో ఆమె ఆస్తి విలువ అక్షరాలా రూ.283 కోట్లు.

7.మల్లీశ్వరి హీరోయిన్ కత్రినా కైఫ్ నెట్ వర్త్ 32 మిలియన్ల డాలర్లు.అంటే సుమారు రూ.267 కోట్లు.

8.దిల్వాలే దుల్హనే లేజాయేంగే మూవీ హీరోయిన్ కాజోల్ దేవగన్ ఆస్తి 24 మిలియన్ల డాలర్లు సంపాదించింది.అంటే అక్షరాలా రూ.200 కోట్లు.

Telugu Aishwarya Rai, Alia Bhatt, Bollywood, Anushka Sharma, Kajol, Priyanka Cho

9.ఆర్ఆర్ఆర్ ఫేమ్, బాలీవుడ్ మోస్ట్ సక్సెస్‌ఫుల్ యంగెస్ట్ హీరోయిన్ ఆలియా భట్ 23 మిలియన్ల డాలర్లు ఎర్న్‌ చేసింది.అంటే రూ.191 కోట్లు.

10.డర్టీ పిక్చర్ ఫేమ్ విద్యాబాలన్(Vidya Balan ) 18 మిలియన్ల డాలర్లు సంపాదించింది.అంటే ఇండియన్ కరెన్సీలో దాదాపు రూ.150 కోట్లు.

Telugu Aishwarya Rai, Alia Bhatt, Bollywood, Anushka Sharma, Kajol, Priyanka Cho

హీరోయిన్ లే ఇంత సంపాదించారంటే ఇక హీరోలు ఎంత సంపాదించి ఉంటారు ఊహించుకోండి.ముఖ్యంగా బాలీవుడ్ కింగ్ షారుఖ్ ఖాన్ ఆస్తి వేలకోట్లలో ఉంటుందని చెప్పుకోవచ్చు.ఆమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్‌ వంటి దిగ్గజ హీరోలు కూడా ఇదే రేంజ్ లో సంపాదించి ఉంటారు.సంపాదన విషయంలో మన టాలీవుడ్ హీరోలు కూడా వీరి కంటే తక్కువేం తక్కువ కాదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube