కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీ తెలంగాణ పర్యటన కొనసాగుతోంది.ఇందులో భాగంగా ఆమె ఖానాపూర్ లో కాంగ్రెస్ తరపున ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు.
తెలంగాణను ఏ విధంగా ముందుకు నడిపించాలో కాంగ్రెస్ కు తెలుసని ప్రియాంక గాంధీ తెలిపారు.సిద్ధాంతాల ఆధారంగా నడిచే పార్టీ కాంగ్రెస్ అని పేర్కొన్నారు.
ఇక్కడి ప్రజల ఆకాంక్షలు తెలిసే సోనియాగాంధీ తెలంగాణను ఇచ్చారని చెప్పారు.కేసీఆర్ అధికారంలోకి వచ్చి పదేళ్లు గడిచినా ప్రజల స్వప్నం నెరవేరలేదని విమర్శించారు.
ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత జీవితాలు మారతాయని ఉద్యమకారులు కలల కన్నారు.కానీ ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదన్నారు.
యువతకు కేసీఆర్ ఉద్యోగాలు ఇవ్వలేదని ఆరోపించారు.అయితే ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని తెలిపారు.రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేయడంతో పాటు రైతులకు ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని వెల్లడించారు.