తెలంగాణ బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసిన అమిత్ షా..!!

తెలంగాణ ఎన్నికలకు ఇంకా 12 రోజులు మాత్రమే సమయం ఉంది.ప్రచారానికి పది రోజులు మాత్రమే మిగిలి ఉంది.

దీంతో ప్రధాన పార్టీల నేతలు ప్రచారంలో దూసుకుపోతున్నారు.ఇదిలా ఉండగా బీజేపీ అగ్రనేత అమిత్ షా ప్రస్తుతం తెలంగాణ పర్యటనలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా అమిత్ షా తెలంగాణ బీజేపీ మేనిఫెస్టోను విడుదల చేశారు.“సకల జనుల సౌభాగ్య తెలంగాణ” పేరుతో మేనిఫెస్టో విడుదల చేయడం జరిగింది.బీజేపీ మేనిఫెస్టోలో అంశాలు.

Telugu Amit Shah, Telangana-Latest News - Telugu

బీసీని ముఖ్యమంత్రి చేస్తాం.ధరణికి బదులు మీ భూమి యాప్ ప్రజలందరికీ సుపరిపాలన, సమర్థవంతమైన పాలన వెనకబడిన వర్గాల సాధికారత, అందరికీ సమానమైన చట్టం వర్తింపు కూడు – గూడు అందరికీ ఆహార నివాస భద్రత రైతే రాజు అన్నదాతలకు అందలం విత్తనాల కొనుగోలుకు ₹2500 ఇన్ పుట్ అసిస్టెన్స్ మహిళలకు 10 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం మహిళా రైతుల కోసం మహిళ రైతు కార్పొరేషన్ యువశక్తి ఉపాధి… యూపీఎస్సీ తరహాలో గ్రూప్ 1, గ్రూప్ 2 పరీక్షల నిర్వహణ ఈడబ్ల్యుఎస్ కోటాతో సహా అన్ని ప్రభుత్వ ఉద్యోగాలను ఆరు నెలలలో భర్తీ చేస్తాం వైద్య శ్రీ లో భాగంగా అర్హత కలిగిన కుటుంబాలకు ఏడాదికి 10 లక్షల రూపాయల ఆరోగ్య భీమా గల్ఫ్ బాధితుల కోసం నోడల్ ఏజెన్సీ కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ మండల కేంద్రాల్లో నోడల్ స్కూల్ ఏర్పాటు

ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రతి నెలా 1వ తేదీనే వేతనాలు బీఆర్ఎస్ పార్టీ అవినీతిపై విచారణకు కమిటీ 4 శాతం ముస్లింల రిజర్వేషన్ల రద్దు ఉమ్మడి పౌరస్మృతి ముసాయిదాకు కమిటీ ఎస్సీల వర్గీకరణకు సహకారం అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలు అర్హత కలిగిన కుటుంబాలకు కొత్త రేషన్‌ కార్డులు ఎరువులు, విత్తనాల కొనుగోలుకు రూ.2,500 సాయం వరికి రూ.3,100 మద్దతు ధర ఆసక్తిగల రైతులకు ఉచితంగా దేశీయ ఆవుల పంపిణీ నిజామాబాద్‌లో టర్మరిక్‌ సిటీ అభివృద్ధి డిగ్రీ, ప్రొఫెషనల్‌ విద్యార్థినులకు ల్యాప్‌టాప్‌లు నవజాత బాలికలకు ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ ఉజ్వల పథకం లబ్ధిదారులకు 4 ఉచిత గ్యాస్ సిలిండర్లు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube