రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి వికాస్ రావు ఎన్నికల ప్రచారంలో భాగంగా భారీ రోడ్ షో ను నిర్వహించారు.డబ్బు చప్పుల్లతో ఒగ్గు డోలు కళాకారులతో మహిళలు మంగళారతులు, బోనాలు, బతుకమ్మలతో డాక్టర్ వికాస్ కి ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా డాక్టర్ వికాస్ రావు మాట్లాడుతూ తాను రాజకీయాలకు స్వార్థం కోసం రాలేదని, ప్రజల కోసమే వచ్చానని, తనపై ఎలాంటి అవినీతి ఆరోపణలు లేవని ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాల కోసం తిరగాల్సిన అవసరం లేదని తమ ఇంటి వద్దకే ప్రభుత్వ పథకాలను తీసుకువస్తామని,
నాడు ఇంటికో ఉద్యోగం ఇస్తామని ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఉద్యోగాలన్నీ తన ఇంటిలోనే పెట్టుకున్న బీఆర్ఎస్ నాయకులు గ్రామాలను ఎలా అభివృద్ధి చేస్తారని, పది సంవత్సరాలుగా పదవిలో ఉండి కేవలం తమ నియోజకవర్గాల్లో అభివృద్ధి చేసుకొని మిగతా నియోజకవర్గాన్ని కన్నేత్తి చూడలేదని, వేములవాడ నియోజకవర్గాన్ని దత్తకు తీసుకునే మొనగాడు ఎవరు పుట్టలేదని, బిజెపికి ఓటు వేసి తనను అసెంబ్లీకి పంపిస్తే అభివృద్ధి చేసి చూపించి ఇతర నియోజకవర్గాలను కూడా తానే దత్తత తీసుకుంటానని అన్నారు.
బిజెపి పార్టీ గూటికి వేములవాడ మాజీ కౌన్సిలర్ దంపతులు.
వేములవాడ మాజీ మున్సిపల్ కౌన్సిలర్ రాపేల్లి లావణ్య శ్రీధర్ బిఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి పట్టణ ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేశారు.రాజన్న సిరిసిల్ల జిల్లా బిజెపి అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ ఆధ్వర్యంలో బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ వికాస్ రావు పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.
దీంతో మాజీ కౌన్సిలర్ దంపతులు బిజెపి పార్టీ తీర్థం పుచ్చుకోవటంతో పట్టణంలో బిజెపి పార్టీకి మరింత బలన్ని చేకూర్చినట్లు అయింది.ఈ సందర్భంగా మాట్లాడుతూ బిజెపి పార్టీ గెలుపు కొరకు అహర్నిశలు కృషి చేస్తానని అన్నారు.