తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు జబర్దస్త్ కమెడియన్ రాకింగ్ రాకేష్( Rocking Rakesh ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.జబర్దస్త్ లో( Jabardasth ) ఎన్నో స్కిట్లు చేసి తన కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూ కమెడియన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నారు రాకేష్.
ఎప్పటినుంచో జబర్దస్త్ లో రాణిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.ఇది ఇలా ఉంటే మొదట్లో పెద్దవారితో కలిసి స్కిట్లు చేసిన రాకింగ్ రాకేష్ ఆ తర్వాత చిన్న పిల్లలతో కలిసి స్కిట్లు చేసి ప్రేక్షకులను నవ్వించారు.
ఆ సంగతి పక్కన పెడితే రాకేష్ ఒక ఇంటివాడైన విషయం తెలిసిందే.ప్రముఖ న్యూస్ యాంకర్ జోర్దార్ సుజాతను( Jordar Sujatha ) ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు రాజేష్.
ఇది ఇలా ఉంటే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రాకేష్ తన కెరియర్ లో ఎదురైన చేదు అనుభవాల గురించి చెప్పుకొచ్చారు.ఈ సందర్భంగా ఇంటర్వ్యూలో భాగంగా రాకేష్ మాట్లాడుతూ.ఒకానొక సమయంలో జబర్దస్త్ నుంచి నన్ను బయటికి వెళ్లిపోమని చెప్పారు.ఎవరో చెప్పిన మాటలు విని నన్ను తప్పుగా అపార్థం చేసుకొని నన్ను బయటికి గెంటేసారు.కానీ నేను ఆ క్షణంలో వారిని ఒకసారి చెక్ చేసుకుని నన్ను అనండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాను.ఆ తర్వాత వాళ్లే నిజం తెలుసుకొని మళ్లీ నన్ను జబర్దస్త్ కి పిలిపించారు అని తెలిపారు రాకేష్.
ఇంకా జబర్దస్త్ లో అవమానాలు బయటికి వెళ్ళాల్సి వచ్చినప్పుడు నిందలు భరించే సమయంలో నాకు రోజా గారు( Roja ) ఎంతో అండగా నిలిచారు.నాకు రోజా గారు అమ్మతో సమానం.
ఆవిడ నాలో ఉన్న మంచితనాన్ని గుర్తించి దాదాపు ఒక గంట పాటు నా దగ్గర కూర్చొని నాకు ఏమి కాదు అని దైర్యం చెప్పి నాకంటూ ఒకరోజు వస్తుందని చెప్పడంతో పాటు నాకు ఎంతో అండగా నిలిచారు అని రాకేష్ తెలిపారు.అలాగే సుజాత( Sujatha ) నేను కలవడానికి కారణం కూడా రోజా గారే మా ఇద్దరిని ఆవిడనే కలిపారు.మా పెళ్ళికి అయిన ప్రతి ఒక ఖర్చు కూడా ఆవిడనే సొంతంగా భరించారు.తిరుపతిలో ఎంతో అంగరంగ వైభవంగా మా పెళ్ళికి జరిపించారు.మా ఇంట్లో జరిగే ప్రతి ఒక వేడుకకు రోజా గారు తప్పకుండా వస్తారు.100 మందిలో 99 మందికి నేను నచ్చకపోవచ్చు కానీ ఒకరికి నచ్చవచ్చు.నేను రోజా గారికి నచ్చాను ఆవిడ నా కోసం ఎంతో చేశారు అనే పొగడ్తల వర్షం కురిపించాడు రాకేష్.అలాగే జబర్దస్త్ లో కేవలం భజన చేసే వాళ్లకు మాత్రమే కాలం.
నీతిగా నిజాయితీగా ఉంటే ఎవరూ నమ్మరు.మనుషులు కూడా బాగా పొగడ్తలకు అలవాటు పడిపోయారు అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.