బిగ్ బాస్ ( Biggboss ) రియాల్టీ షోలోకి చాలామంది గెలుపు కోసం వస్తే మరికొంతమంది ఫేమస్ అవ్వడం కోసం వస్తారు.ఇక ఇంకొంతమంది డబ్బుతో పాటు ఫేమస్ కూడా అయిపోవచ్చు అని,ఈ షోకి వస్తే ఖచ్చితంగా సినిమాల్లో అవకాశాలు వస్తాయి అని భావిస్తారు.
అలా ఇప్పటికే కొంతమంది ఫేమస్ అయితే మరి కొంత మంది ఫేమస్ అయిన వాళ్ళకి అవకాశాలు రాకుండా కనుమరుగైపోయారు.ఇదిలా ఉంటే బిగ్ బాస్ 5 విన్నర్ వీ.
జే.సన్నీ ( Biggboss 5 Winner ) ప్రస్తుతం సినిమాల్లో హీరోగా చేస్తున్న సంగతి మనకు తెలిసిందే.
ఇక ఈయన హీరోగా చేస్తున్న సౌండ్ పార్టీ ( Sound Party ) అనే మూవీ నవంబర్ 24న విడుదలకు సిద్ధంగా ఉంది.అయితే తాజాగా బిగ్ బాస్ ప్రైస్ మనీ గురించి కొన్ని సంచలన కామెంట్లు చేశారు.బిగ్ బాస్ 5 విన్నర్ వి.జే సన్నీ మాట్లాడుతూ బిగ్ బాస్ టైటిల్ గెలవడం కోసం ఎంతో కష్టపడ్డాను.50 లక్షలు దక్కించుకోవాలి అనుకున్నాను.కానీ చివరికి 50- 50 అనేలా నాకు సగం గవర్నమెంట్ కి సగం ఇవ్వాల్సి వచ్చింది.
దాదాపు టాక్స్ ల రూపంలో గవర్నమెంట్ వాళ్ళు 20 లక్షల వరకు తీసేసుకున్నారు .27 లక్షలు తీసుకున్నాక మిగతా డబ్బులు నాకు ఇచ్చారు.గెలుపు నాది అమౌంట్ వాళ్లది కష్టం నాది ప్రతిఫలం వాళ్లది అనేలా మారిపోయింది.జీఎస్టీ కారణంగా నా ప్రైజ్ మనీ లో సగానికి పైగా గవర్నమెంట్ కి వెళ్ళింది అంటూ బిగ్ బాస్ 5 విన్నర్ వీ.
జే.సన్నీ ( V.J.Sunny ) చెప్పుకొచ్చారు.