సీనియర్ నటుడు చంద్రమోహన్ గురించి ఈ విషయాలు మీకు తెలుసా.. అంత మంచి వ్యక్తి అంటూ?

ప్రముఖ టాలీవుడ్ నటులలో ఒకరైన చంద్రమోహన్( Chandra Mohan ) హైదరాబాద్ లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.చంద్రమోహన్ మృతితో టాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదఛాయలు అలుముకున్నాయి.

 Shocking And Interesting Facts About Chandramohan Details Here Goes Viral In Soc-TeluguStop.com

టాలీవుడ్ సినీ, రాజకీయ ప్రముఖులు చంద్రమోహన్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు.ఇండస్ట్రీలో మంచి మనిషిగా ఆయన పేరు తెచ్చుకున్నారు.

ఇతరులకు సహాయం చేసే విషయంలో ఆయన ముందువరసలో ఉండేవారు.

చంద్రమోహన్ కు జోడీగా నటించిన హీరోయిన్లు స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకుని కెరీర్ పరంగా అంతకంతకూ ఎదిగారు.చంద్రమోహన్ తన సినీ కెరీర్ లో ఎన్నో వైవిధ్యమైన పాత్రలలో నటించి ప్రశంసలు అందుకున్నారు.చంద్రమోహన్ అసలు పేరు మల్లంపల్లి చంద్రశేఖర్ రావు కాగా ఆయన కృష్ణా జిల్లా పమిడిముక్కలలో జన్మించారు.

రంగుల రాట్నం సినిమా( Rangula Ratnam movie )తో చంద్రమోహన్ ఇండస్ట్రీకి పరిచయమయ్యారు.చంద్రమోహన్ దంపతులకు ఇద్దరు కూతుళ్లు కాగా ఇద్దరికీ వివాహాలు అయ్యాయి.చంద్రమోహన్ పెద్ద కూతురు మీనాక్షి అమెరికాలో సైకాలజిస్ట్ గా స్థిరపడగా రెండో కూతురు మాధవి చెన్నైలో డాక్టర్ గా పని చేస్తున్నారు.చంద్ర మోహన్ తొలి సినిమాకే నంది అవార్డ్( Nandi Award ) ను అందుకున్నారు.55 సంవత్సరాల సినీ కెరీర్ లో 932 సినిమాలలో చంద్రమోహన్ నటించారు.

చంద్రమోహన్ ఒక సందర్భంలో డబ్బులు దాచుకునే వారికి విలువ ఉంటుందని చెప్పారు.చంద్రమోహన్ సుధ కాంబినేషన్ బ్లాక్ బస్టర్ కాంబినేషన్ అని చెప్పవచ్చు.గత కొంతకాలంగా చంద్రమోహన్ సినిమాలలో నటించలేదు.

చంద్రమోహన్ మరణం ఇండస్ట్రీకి తీరని లోటు అనే చెప్పాలి.ఎమోషనల్, కామెడీ రోల్స్ లో చంద్రమోహన్ నటనకు ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు.

చంద్రమోహన్ ఎన్నో సినిమాల సక్సెస్ లో కీలక పాత్ర పోషించారు.ఈతరం యూత్ లో కూడా ఎంతోమంది చంద్రమోహన్ నటనను అభిమానిస్తారు.

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఎంతోమందికి చంద్రమోహన్ తండ్రిగా నటించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube