2023 వరల్డ్ కప్ టోర్నీలో శ్రీలంక ఆశించిన రీతిలో రాణించలేకపోవడం తెలిసిందే.టోర్నీలో 9 మ్యాచ్ లు ఆడగా రెండు మ్యాచ్ లు గెలిచి ఏడు మ్యాచ్ లు ఓడిపోయింది.
మరోపక్క శ్రీలంక జట్టులో మొత్తం కొత్త సభ్యులు కావటంతో సీనియర్ల లోటు స్పష్టంగా కనిపించింది.ఇండియాతో జరిగిన మ్యాచ్ లో ఏకంగా 302 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.
శ్రీలంక 55 పరుగులకే ఆల్ అవుట్ అయ్యింది.భారత్ తో అంత ఘోరంగా ఓటమి చెందటంతో.
ఆ మ్యాచ్ అనంతరం రెండు రోజులకే శ్రీలంక ప్రభుత్వం.దేశ క్రికెట్ బోర్డు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది.
కాగా స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన లంక క్రికెట్ బోర్డు మేనేజ్మెంట్ విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకోవడంతో ఐసీసీ కూడా బోర్డును సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది.దీంతో లంక క్రికెట్ మండలికి షాక్ లు మీద షాక్ లు తగిలాయి.ఒకపక్క ప్రభుత్వం మరోపక్క అంతర్జాతీయ క్రికెట్ మండలి సస్పెండ్ చేస్తూ నిర్ణయాలు తీసుకోవటం.సంచలనంగా మారింది.పైగా శ్రీలంక బోర్డు సభ్యులపై తీవ్రమైన అవినీతి ఆరోపణలు ఉన్నాయి.వన్డే మెన్స్ వరల్డ్ కప్ టోర్నీలో ఏడు మ్యాచ్ లు ఓడిపోవడంతో శ్రీలంక స్వదేశానికి పయనం అయ్యింది.