బ్రెజిల్‌లో బీచ్‌కి వెళ్లేవారికి షాకింగ్ అనుభవం.. భారీ అల ఎలా వణికించిందో చూడండి..

2023, నవంబర్ 5న ఆదివారం నాడు బ్రెజిల్‌లోని( Brazil ) రియో ​​డి జనీరోలోని లెబ్లాన్ బీచ్‌కు( Leblon Beach ) వెళ్ళిన కొందరికి షాకింగ్ ఎక్స్‌పీరియన్స్ ఎదురయ్యింది.సముద్రతీరానికి వెళ్లి ఎంజాయ్ చేయాలనుకున్న వారిని పెద్ద అల ముంచెత్తి తీవ్ర భయాందోళనకు గురిచేసింది.

 Massive Wave Disrupting In Brazil Leblon Beach Viral Video Details, Sneaker Wave-TeluguStop.com

అల చాలా శక్తివంతమైనది, అది బీచ్ కుర్చీలు, గొడుగులను తుడిచిపెడుతూ బీచ్ కి వెళ్ళిన వారిని రహదారి మీదకు లాక్కెళ్ళింది.అదృష్టవశాత్తూ, అలల కారణంగా ఎవరూ గాయపడలేదు లేదా మరణించలేదు.

ఈ అల స్నీకర్ వేవ్( Sneaker Wave ) కావచ్చు, దీనిని రోగ్ వేవ్ అని కూడా పిలుస్తారు, ఇది అరుదైన, అనూహ్యమైన తీర అల, ఇది హెచ్చరిక లేకుండా బీచ్ పైకి ఎగసిపడుతుంది.స్నీకర్ వేవ్ చాలా ప్రమాదకరమైనవి, ముఖ్యంగా పిల్లలు, పెంపుడు జంతువులకు, కొన్నిసార్లు నడుము స్థాయి లేదా అంతకంటే ఎక్కువ స్థాయికి చేరుకోవచ్చు.

కొన్ని స్నీకర్ వేవ్స్‌ 150 అడుగుల (45 మీటర్లు) వరకు కూడా ఉంటాయి.

ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోమవారం ఎక్స్ అకౌంట్ డిజాస్టర్ ట్రాకర్‌లో షేర్ చేయడం జరిగింది.అలలు నెమ్మదిగా హోరిజోన్‌లో( Horizon ) లేచి, ఆపై తప్పించుకోవడానికి ప్రయత్నించిన సన్‌బాథర్‌లపైకి దూసుకుపోతున్నట్లు వీడియోలో కనిపించింది.వీడియోపై ఎక్స్ యూజర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు కామెంట్స్ చేశారు.

ఇది ఊహించని చాలా భయంకరమైన అనుభవం అని కొందరు కామెంట్ చేయగా మరికొందరు ఎవరూ చనిపోలేదని ఇది థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్ గా ఉంటుందని కొందరు జోకులు వేస్తున్నారు.

పిల్లలు నిర్మించిన ఇసుక కోటలు, పుస్తకాన్ని చదువుతున్న రీడర్స్ ఎంత బాధపడి ఉంటారో అని ఒక నెటిజన్ కామెంట్ పెట్టాడు.కొంతమంది యూజర్లు సొంత అనుభవాలను లేదా స్నీకర్ వేవ్‌ల గురించిన వివరాలను కూడా పంచుకున్నారు.ఒక వినియోగదారు ట్రినిడాడ్‌లోని మూన్‌స్టోన్ బీచ్( Moonstone Beach ) నుండి ఇలాంటి వీడియోను పోస్ట్ చేసారు, అక్కడ కొన్ని సంవత్సరాల క్రితం ఒక ఊహించని అల సంభవించింది.

ఈ వీడియోను మీరు కూడా చూసేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube