Amardeep: అమర్ దీప్ దెబ్బకు పిట్టల్లా అందరు విలవిలా.. ఇది కదా కావాల్సింది..!

నిన్న జరిగిన ఎపిసోడ్ లోకి వెళ్లడం లేదు కానీ.ఎపిసోడ్ చూస్తున్నంత సేపు అమర్ దీప్( Amardeep ) అట తీరు ముచ్చటేసింది.

 Amar Deep Physical Game In Bigg Boss Telugu 7-TeluguStop.com

ఇదే కదా కావాల్సింది.ఆట అంటే ఆటనే.

అందులో ఆడ, మొగ అనే తేడా ఉండదు.అశ్విని( Ashwini ) నన్ను అందరు కలిసి అటాక్ చేసారు అని ఒకటే ఏడుపు.

కానీ ఆటలో ఆడపిల్ల అని ఆడకుండా ఉంటారా, అగ్రెసివ్ అవ్వకుండా ఉంటె రేపు కప్పు గెలిచే అవకాశం పోతుంది కదా.శోభా కోసం( Shoba Shetty ) అమర్ దీప్ చాల రిస్క్ తీసుకున్నాడు కానీ గెలిచింది శోభా కాదు.ఖచ్చితంగా అమర్ దీప్ ఆటే గెలిచింది.

చాల రోజులుగా కేవలం ఎదో ఒక ఫౌల్ గేమ్ ఆడి, అందులో కూడా ఓడిపోయి, అందరికి దొరికిపోయి నాగార్జున తో( Nagarjuna ) వారాంతంలో తిట్లు పడి, ఇంకోసారి ఇలాంటివి జరగనివ్వను అని చెప్పి చెప్పి అమర్ అలసి పోయాడు.

నిజమైన ఆటను, తన వేటను నిన్న మాత్రమే చూపించాడు.ఈ మాత్రం తెలివి ముందు నుంచి లేకపోలేదా అని కొంతమంది సెటైర్ వేయచ్చు.కానీ తనకంటూ ఒకరోజు వస్తే అమర్ ఎలా ఆడుతాడు అనేది అందరికి అర్ధం అయ్యింది.

Telugu Amar Deep, Arjun, Ashwini, Bhole Shavali, Bigg Boss Task, Nagarjuna, Shiv

తాను ఫిజికల్ గేమ్ లో స్ట్రాంగ్ అలాగే మైండ్ గేమ్ లో కూడా స్ట్రాంగ్ అని నిరూపించుకున్నాడు.ఇకపై ఎలాంటి మిస్టేక్స్ చేయక పోతే పర్వాలేదు.ఖచ్చితంగా టాప్ 5 లోకి వెళ్తాడు.

అతడితో పాటు ఆడిన వారిలో భోలే శవాలి( Bhole Shavali ) తప్ప ఎవరు సరైన పోటీ కూడా ఇవ్వలేక పోయారు.అశ్విని, శివాజీ, ప్రియాంక, మినిమమ్ ఆట తీరును చూపించలేక పోయారు.

గద్ద ల పక్షి పిల్లల పై పోటీ చేస్తే ఎలా ఉంటుందో అంత విలవిలా లాడించేసాడు.

Telugu Amar Deep, Arjun, Ashwini, Bhole Shavali, Bigg Boss Task, Nagarjuna, Shiv

మరోవైపు ఎంత కసిగా ఆడాడో అన్ని గాయాలు కూడా తగిలించుకున్నాడు.కానీ మిగతా వారిలా అక్కడ కొట్టావ్, ఇక్కడ రక్కావ్ అంటూ ఎవరిపై కంప్లైంట్స్ చేయలేదు.శివాజీ( Sivaji ) అయితే ఒక్క దెబ్బకే భుజం నొప్పి తిరగ బెట్టేయడం తో విలవిలా లాడిపోయాడు.

దాంతో అర్జున్( Arjun ) సైతం తనకు తాను సెల్ఫ్ అవుట్ అని ప్రకటించుకున్నాడు.అయితే ఆట ముగిసాక కాళ్లను పట్టుకొని అమర్ క్షమాపణ కోరడం అతడిని ఆటలో మరొక మెట్టు ఎక్కించింది.

అమర్ దీప్ ఇలాగె ఆడాలని అయన అభిమానులు కోరుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube