తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న సీనియర్ హీరోలలో నాగార్జున( Nagarjuna ) ఒకరు.ప్రస్తుతం ఆయన బిగ్ బాస్ సీజన్ 7 లో చాలా బిజీగా ఉన్నారు.
ఇంకా అందులో భాగంగానే తన తదుపరి సినిమాని కూడా అనౌన్స్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది.ఇక ఇప్పటికే సోగ్గాడే చిన్నినాయన,( Soggade Chinninayana ) బంగార్రాజు( Bangarraju ) లాంటి రెండు బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన కళ్యాణ్ కృష్ణ డైరెక్షన్ లో మరో సినిమా చేయబోతున్నట్లుగా తెలుస్తుంది.
నిజానికి కళ్యాణ్ కృష్ణ చిరంజీవితో సినిమా చేయాలి కానీ చిరంజీవి ప్రస్తుతం వశిష్ఠ డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు కాబట్టి ఈ గ్యాప్ లో నాగార్జునతో మరో సినిమా చేయబోతున్నట్టు గా తెలుస్తుంది.
ఇక ఇప్పటికే నాగార్జున ప్రసన్నకుమార్ బెజవాడ డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నాడు ఈ సినిమా కి సంభందించిన అప్డేట్ ఏది బయటకు రావడం లేదు అందులో భాగంగానే ప్రస్తుతం కళ్యాణ్ కృష్ణ( Kalyan Krishna ) డైరెక్షన్ లో కూడా మరో సినిమా చేయబోతున్నట్లుగా తెలుస్తుంది.ఇక ఈ సినిమాలన్నీ కూడా 2024 ఎండింగ్ కల్లా మొత్తం కంప్లీట్ చేసి 2024 లో వరుసగా మూడు సినిమాలను రిలీజ్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది.
ఇక ఈ ఇయర్ నాగార్జున ఒక సినిమా కూడా రిలీజ్ కాలేదు కాబట్టి నెక్స్ట్ ఇయర్ మూడు సినిమాలతో రాబోతున్నట్టుగా తెలుస్తుంది.ఇక ఇది ఇలా ఉంటే నాగార్జున వరుసగా సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో జూనియర్ హీరోలకు సైతం పోటీని ఇస్తున్నాడు.ఈ క్రమం లోనే నాగార్జున తన కొడుకుల అయిన నాగచైతన్య ,( Nagachaitanya ) అఖిల్( Akhil ) సినిమాలను కూడా సెట్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది.
అందులో భాగంగానే అఖిల్ కొత్త సినిమా ఎవరితో చేయాలనే చర్చలు జరుగుతున్నాయి.ఏజెంట్ సినిమా ఫ్లాప్ తర్వాత అఖిల్ ఎలాంటి సినిమా చేయాలనే దానిమీదనే ఎక్కువ చర్చ జరుగుతుంది…
.