Nayanthara: నయనతార అసలు అభిరుచి ఏంటో తెలుసా.. ఈ ముద్దుగుమ్మ ప్రిఫరెన్సెస్ చాలా డిఫరెంట్… 

లేడీ సూపర్ స్టార్ నయనతార( Nayanthara ) ప్రస్తుతం ఒక్కో సినిమాకి రూ.10 కోట్లు రెమ్యునరేషన్ గా పొందుతోందని వార్తలు వస్తున్నాయి.నిజానికి ఆమె సినిమా ప్రమోషన్లకు వెళ్ళదు.ప్రెస్ మీట్‌కి అసలు హాజరవ్వదు.జస్ట్ నటన వరకు మాత్రమే పరిమితం అవుతుంది.అది కూడా అందాలు ఆరబోసే నటనలకు దూరంగా ఉంటుంది.

 Nayan Mind Blowing Taste-TeluguStop.com

తన పాత్రకు ప్రాధాన్యం ఉంటేనే చేస్తుంది.హీరోల పక్కన ఆట బొమ్మలా కనిపించేందుకు ఆమె ఒప్పుకోదు.

మొత్తంగా హీరోయిన్( Heroine ) అంటే తోలుబొమ్మ అనే అభిప్రాయాన్ని ఈ ముద్దుగుమ్మ చెరిపి వేస్తోందని చెప్పవచ్చు.

Telugu Nayanthara, Lady Nayanthara, Ps Vinodaraj, Sonyliv, Vignesh Shivan-Movie

ఆమెలో ఇంకొక కోణం కూడా ఉంది.అదే సొంతంగా అద్భుతమైన సినిమాలను నిర్మించే ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం.నేత్రికన్, కాతువాకుల రెండు కాదల్ వంటి సినిమాలను ఈ ముద్దుగుమ్మ నిర్మించింది.

అయితే వాటికంటే ఆమె నిర్మించిన మరో సినిమా మాత్రం బాగా ఆకట్టుకుంది.అదే పెబెల్స్ (Koozhangal – Pebbles).

కూళామ్‌గళ్ అని తమిళంలో ఈ సినిమాని పిలుస్తారు.నయనతార, ఆమె భర్త విగ్నేష్ శివన్( Vignesh Shivan ) నిర్మించిన ఈ సినిమా విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది.

తమిళంలో సూర్య, జ్యోతిక జంట ఎలా మంచి సినిమాలు తీస్తారో అలా నయనతార దంపతులు ఇప్పుడు మంచి సినిమాలు తీయడం స్టార్ట్ చేశారు.

Telugu Nayanthara, Lady Nayanthara, Ps Vinodaraj, Sonyliv, Vignesh Shivan-Movie

రూరల్ లైఫ్ అద్భుతంగా క్యాప్చర్ చేయడంలో పెబెల్స్ సినిమా సక్సెస్ అయ్యింది.పి.ఎస్ వినోదరాజ్( PS Vinodaraj ) డైరెక్ట్ చేసిన పెబెల్స్ లో తాగుబోతు తండ్రిని గురకరాయి లాంటి ఎలిమెంటరీ కొడుకు మార్చడానికి ట్రై చేస్తాడు.

ఆ చిన్న పిల్లోడు తండ్రిని మార్చడా లేదా అనేది ఈ సినిమా కథాంశం.ఇలాంటి మూవీ మన తెలుగు వారు చేయడానికి ఎన్నటికీ ఒప్పుకోరు.అసలు ఇలాంటి కథలు వినడానికే వారు ఆసక్తి చూపరు.కానీ

నయనతార విగ్నేష్ శివన్

ఆ మూవీ కథ విని దానిని సొంతంగా ప్రొడ్యూస్ చేసి అందరి ప్రశంసలు అందుకున్నారు.

నిజంగా నయనతార కంటెంట్ కి ప్రాధాన్యత ఇస్తుందనడానికి ఈ సినిమానే నిదర్శనం.ఈ మూవీ చాలా అవార్డులను గెలుచుకుంది.

చూడాలనుకునేవారు సోనీ లీవ్( SonyLiv ) ఓటీటీలో దీనిని చూడవచ్చు.నయనతార కథలను ఎంచుకోవడంలో ఎంత నైపుణ్యం కలిగి ఉందో ఈ సినిమా చూస్తే అర్థమవుతుంది.

అంతేకాదు ఆమె అభిరుచి అంత మంచిగా ఉంటుందో స్పష్టంగా తెలుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube