రాజన్న సిరిసిల్ల జిల్లా: ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన గయసుద్దీన్ 22 సం అనే యువకుడు అదే రాష్ట్రానికి చెందిన మరొక వ్యక్తితో శుక్రవారం రాత్రి సమయంలో అతివేగంగా ద్విచక్ర వాహనంపై వేములవాడ నుంచి కోనేపల్లి కి వెళ్తూ అదుపుతప్పి చెట్టుకు ఢీకొనగా హెల్మెట్ లేకపోవడం వల్ల ద్విచక్ర వాహనం నడుపుతున్న గయసుద్దీన్ తల చెట్టుకు బలంగా ఢీకోనడం వల్ల రక్త గాయాలతో అక్కడికక్కడే మరణించాడు.
వెనుక కూర్చున్న వ్యక్తికి స్వల్ప గాయాలు అయినాయి అని మృతుని అన్న ఇచ్చిన దరఖాస్తు లో వేములవాడ పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈ సందర్భంగా టౌన్ సిఐ పి కరుణాకర్ మాట్లాడుతూ ద్విచక్ర వాహనం నడిపే ప్రతి ఒక్కరూ కచ్చితంగా హెల్మెట్ ధరించాలని అతివేగంగా వెళ్లవద్దని ట్రాఫిక్ రూల్స్ కచ్చితంగా పాటించాలని ప్రతి ఒక్కరూ లైసెన్స్, ఇన్సూరెన్స్ కలిగి ఉండాలని తమ గమ్యస్థానాలకు క్షేమంగా చేరాలని తెలిపారు.