తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలామంది డైరెక్టర్ లలో వినాయక్( V V Vinayak ) ఒకరు.ఈయన చేసిన చాలా సినిమాలు ఇండస్ట్రీలో మంచి విజయాలను అందుకున్నాయి.
అయితే ఈయన బాలకృష్ణతో చేసిన చెన్నకేశవరెడ్డి( Chennakesava Reddy ) సినిమా ఒక సూపర్ సక్సెస్ అవ్వాల్సిన సినిమా కానీ అది మీడియం రేంజ్ సినిమాగానే ఆగిపోయింది.దానికి కారణం అప్పట్లో చాలా మంది చాలా రకాలుగా చెప్పినప్పటికీ ఆ సినిమాలో ఉన్న సీనియర్ క్యారెక్టర్ అయినా బాలయ్య బాబు క్యారెక్టర్ లో ఉన్న డెప్త్ ని ఆ సినిమాలో ఫుల్ ఫ్లెడ్జెడ్ గా వాడుకోలేదు.
అందుకే ఆ సినిమా అనేది ఒక కేటగిరి వర్గానికి చెందిన ప్రేక్షకులను అలరించడంలో కొంతవరకు వెనుకబడిపోయిందనే చెప్పాలి.
ఇక ఇలాంటి క్రమంలో చెన్నకేశవరెడ్డి సినిమా అందుకే అందరి అంచనాలను అందుకోలేక పోయింది అనే చర్చ అయితే సాగుతుంది.నిజానికి ఈ సినిమాలో ముందుగా సీనియర్ బాలకృష్ణ ఒక్కడి మీదనే స్టోరీ రాసుకొని ఆ తర్వాత దాంట్లో జూనియర్ బాలకృష్ణని చేర్పించాల్సి వచ్చింది.అలా బాలయ్య బాబు డ్యూయల్ రోల్ లో నటించడం వల్ల ఈ సినిమా కంటెంట్ అనేది అంత ఫుల్ ఫ్లెడ్జడ్ గా ఇమాడ లేదు అనే చెప్పాలి.
ఇక ఈ క్రమంలోనే ఒక్కడి తో నడిచే స్టోరీలోకి పరుచూరి బ్రదర్స్ వచ్చి ఇద్దరు బాలకృష్ణ ( Balakrishna )లు ఉన్న స్టోరీ ని యాడ్ చేయడం వల్ల ఈ సినిమా ఒక కేటగిరి వర్గానికి నచ్చలేదని అప్పట్లో రాసిన వాళ్ళు చాలామంది మెన్షన్ చేశారు.అయితే ప్రస్తుతం బాలయ్య బాబు అంటే ఒక మాస్ హీరోతో వివి వినాయక్ మరో సినిమా చేస్తే చూడాలని ఉంది అని ఇప్పటికీ చాలామంది అభిమానులు వాళ్ల భావాలను వ్యక్తం చేస్తున్నారు.నిజానికి వీళ్ళ కాంబినేషన్ లో ఎప్పుడు సినిమా వస్తుందో చూడాలి.అని చాలా మంది చూస్తున్నారు…
.