'గేమ్ చేంజర్' సాంగ్ వాయిదా.. మెగా కాంపౌండ్ నుండి క్లారిటీ!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ( Ram Charan )కు ఇప్పుడు గ్లోబల్ వైడ్ గా పేరు ఉంది.ఆర్ఆర్ఆర్( RRR movie ) ఇచ్చిన ఫేమ్ ను మరింత పెంచుకునేలా చరణ్ తన లైనప్ ను సెట్ చేసుకుంటున్నాడు.

 Game Changer Song Release Cancelled, Game Changer, Game Changer First Song-TeluguStop.com

ప్రజెంట్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ సినిమాల్లో ‘‘గేమ్ ఛేంజర్”( Game Changer )ఒకటి.ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమాను అగ్ర డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్నాడు.

ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ చాలా ఎదురు చూస్తున్నారు.కానీ ఎలాంటి అప్డేట్స్ శంకర్ ఇవ్వక పోవడంతో ఫ్యాన్స్ గరంగరంగా ఉన్నారు.అయితే ఈ దసరా కానుకగా ఈ సినిమా నుండి ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేయనున్నారని న్యూస్ నెట్టింట వైరల్ అయ్యింది.

దీంతో దసరాకు అయినా అప్డేట్ రాబోతుందని ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

కానీ ఇప్పుడు ఫ్యాన్స్ కు మరో బ్యాడ్ న్యూస్ తెలుస్తుంది.

ఈ సినిమా ఫస్ట్ సాంగ్ రిలీజ్ పై మెగా కాంపౌండ్ నుండి సమాచారం అందుతుంది.వస్తున్నా వార్తల ప్రకారం ఈ సినిమా నుండి దసరా కానుకగా సాంగ్ ను రిలీజ్ చేయడం లేదట.

ప్రజెంట్ తమ ప్లాన్స్ అన్ని నిలిపి వేశారని దీంతో ఈ ఫస్ట్ సింగిల్ అప్డేట్ ఇప్పట్లో ఇచ్చే ఆలోచనలో కూడా మేకర్స్ లేనట్టు టాక్.

ఈ న్యూస్ ఫ్యాన్స్ కు మరింత ఆగ్రహం తెప్పిస్తుంది.ఇప్పటికైనా ఏదొక అప్డేట్ వస్తుంది అని ఎదురు చూసే ఫ్యాన్స్ కు మరోసారి నిరాశ ఎదురయ్యింది.కాగా తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను దిల్ రాజు భారీ బడ్జెట్ తో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.

బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ ( Kiara Advani )గా నటించింది.చూడాలి ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube