‘గేమ్ చేంజర్’ సాంగ్ వాయిదా.. మెగా కాంపౌండ్ నుండి క్లారిటీ!
TeluguStop.com
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ( Ram Charan )కు ఇప్పుడు గ్లోబల్ వైడ్ గా పేరు ఉంది.
ఆర్ఆర్ఆర్( RRR Movie ) ఇచ్చిన ఫేమ్ ను మరింత పెంచుకునేలా చరణ్ తన లైనప్ ను సెట్ చేసుకుంటున్నాడు.
ప్రజెంట్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ సినిమాల్లో ''గేమ్ ఛేంజర్''( Game Changer )ఒకటి.
ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమాను అగ్ర డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్నాడు.
"""/" /
ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ చాలా ఎదురు చూస్తున్నారు.
కానీ ఎలాంటి అప్డేట్స్ శంకర్ ఇవ్వక పోవడంతో ఫ్యాన్స్ గరంగరంగా ఉన్నారు.అయితే ఈ దసరా కానుకగా ఈ సినిమా నుండి ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేయనున్నారని న్యూస్ నెట్టింట వైరల్ అయ్యింది.
దీంతో దసరాకు అయినా అప్డేట్ రాబోతుందని ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.కానీ ఇప్పుడు ఫ్యాన్స్ కు మరో బ్యాడ్ న్యూస్ తెలుస్తుంది.
ఈ సినిమా ఫస్ట్ సాంగ్ రిలీజ్ పై మెగా కాంపౌండ్ నుండి సమాచారం అందుతుంది.
వస్తున్నా వార్తల ప్రకారం ఈ సినిమా నుండి దసరా కానుకగా సాంగ్ ను రిలీజ్ చేయడం లేదట.
ప్రజెంట్ తమ ప్లాన్స్ అన్ని నిలిపి వేశారని దీంతో ఈ ఫస్ట్ సింగిల్ అప్డేట్ ఇప్పట్లో ఇచ్చే ఆలోచనలో కూడా మేకర్స్ లేనట్టు టాక్.
"""/" /
ఈ న్యూస్ ఫ్యాన్స్ కు మరింత ఆగ్రహం తెప్పిస్తుంది.ఇప్పటికైనా ఏదొక అప్డేట్ వస్తుంది అని ఎదురు చూసే ఫ్యాన్స్ కు మరోసారి నిరాశ ఎదురయ్యింది.
కాగా తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను దిల్ రాజు భారీ బడ్జెట్ తో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.
బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ ( Kiara Advani )గా నటించింది.
చూడాలి ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో.
ఇండియాలో సౌత్ దర్శకుల హవా ఎక్కువగా కొనసాగుతుందా..?