తెలంగాణలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నిర్వహించిన విజయభేరీ తొలి విడత బస్సు యాత్ర ముగిసింది.
రామప్ప దేవాలయం నుంచి రాహుల్, ప్రియాంక గాంధీ ప్రారంభించిన ఈ బస్సు యాత్ర మూడు రోజుల పాటు కొనసాగింది.
ములుగు, భూపాలిపల్లి, మంథని, పెద్దపల్లి, కరీంనగర్, జగిత్యాల, చొప్పదండి, బాల్కొండ మరియు ఆర్మూర్ నియోజకవర్గాల్లో బస్సు యాత్ర సాగింది.తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా పార్టీలన్నీ ప్రచారాన్ని ముమ్మరం చేసిన సంగతి తెలిసిందే.
ఇందులో భాగంగానే కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా బస్సు యాత్రను నిర్వహించింది.ఇందులో భాగంగా కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని కాంగ్రెస్ ఇచ్చిన మాట తప్పదని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు.