కాలం గడుస్తున్న కొద్దీ కోతులు కూడా మనలాగే తెలివైనవిగా మారుతున్నాయి.ఇవి చాలా తెలివిగా దొంగతనాలు చేస్తూ అందర్నీ నోరెళ్లబెట్టేలా చేస్తున్నాయి.
హిమాచల్ ప్రదేశ్‌లోని మనాలిలోని హిడింబ ఆలయం చుట్టూ ఉన్న కోతులు వస్తువులను దోచుకోవడంలో పేరుగాంచగా, ఇప్పుడు పొరుగు దేశం ఇండోనేషియాలో కూడా కోతులు ఇదే ట్రెండ్ ఫాలో అయిపోతున్నాయి. బాలి ద్వీప ప్రావిన్స్‌లో( island province of Bali ) కోతులు ప్రజలు తమకు ఫుడ్ ఇచ్చేలా చేసేందుకు ఫోన్‌లు, కెమెరాల వంటి విలువైన వస్తువులను కొట్టేస్తున్నాయి.
మంచి ఫుడ్ అందించే వరకు వాటిని తిరిగి ఇచ్చేందుకు ఇవి నిరాకరిస్తున్నాయి.ఇలా బ్లాక్ మెయిల్ చేయడంలో ఇవి బాగా నైపుణ్యం సాధించాయి.
మీరు నమ్మకం లేదా? అయితే వైరల్ అవుతున్న వీడియో చూడాల్సిందే.ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతున్న ఈ వీడియో ఓపెన్ చేస్తే మనకు కోతి పండ్ల కోసం ఫోన్ ట్రేడ్ చేయడం చూడవచ్చు.
వీడియో పాతదా లేదా ఇటీవలి రికార్డింగ్ అయ్యిందా అనేది తెలియ రాలేదు కానీ ఇటీవలే ఇది సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది.ఆ వీడియో ఓపెన్ చేస్తే మనకు మొబైల్ తిరిగి ఇవ్వమని కోతిని ఒప్పించే ప్రయత్నంలో ఒక మహిళ తన పండ్లను ఒక్కొక్కటిగా ఇస్తుండటం చూడవచ్చు.మొదటగా ఒక పండు ఇచ్చినప్పుడు ఆ కోతి మహిళ ఫోన్‌ని పట్టుకున్నట్లు చూపిస్తుంది.కానీ ఇంకొన్ని పండ్లు ఇచ్చేదాకా అది ఫోన్ ఇవ్వడానికి ఒప్పుకోదు, కోతి మొండిగా ఫోన్‌ను వదిలివేయడానికి నిరాకరించడంతో సదరు మహిళ చేసేదేమీ లేక రెండు పండ్లు ఇస్తుంది.
అప్పుడు మాత్రమే కోతి ఫోన్ తిరిగి ఇస్తుంది.ఈ వీడియో చూసిన నెట్ సెంటర్ ఆశ్చర్యపోతున్నారు చాలామంది ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.ఒక యూజర్ “వ్యాపారం ఎలా చేయాలో వాటికి తెలుసు.” చమత్కరించారు.ఈ వీడియోను మీరు కూడా చూసేయండి.