తక్కువ రిస్కుతో 30% వరకు రిటర్న్స్.. బెస్ట్-3 లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్‌ మీకోసం..

మంచి పెట్టుబడి ఎంపిక కోసం చూస్తున్నట్లయితే, మీరు లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్‌ను( Large Cap Mutual Funds ) పరిగణించవచ్చు.ఇవి చిన్న వాటి కంటే మార్కెట్ హెచ్చు తగ్గులను హ్యాండిల్ చేయగల పెద్ద, స్థిరమైన కంపెనీలలో పెట్టుబడి పెట్టే ఫండ్స్.

 Returns Up To 30% With Low Risk Best-3 Large Cap Mutual Funds For You, Large-cap-TeluguStop.com

లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ మీకు చాలా ఎక్కువ రాబడిని ఇవ్వకపోవచ్చు, కానీ అవి మరింత విశ్వసనీయంగా, స్థిరంగా ఉంటాయి.లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్స్‌ చేసేవారు, లో-రిస్క్ మాత్రమే తీసుకోగల పెట్టుబడిదారులకు ఇవి ఉత్తమంగా నిలుస్తాయి.

భారతదేశంలోని మ్యూచువల్ ఫండ్స్ ఇండస్ట్రీ బాడీ అయిన AMFI ప్రకారం, గత మూడేళ్లలో అత్యుత్తమ పనితీరు కనబరిచిన మూడు లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ ఏవో తెలుసుకుందాం.

– నిప్పాన్ ఇండియా లార్జ్ క్యాప్ ఫండ్:( Nippon India Large Cap Fund )

ఈ ఫండ్ గత మూడేళ్లలో సంవత్సరానికి సగటున 30.18% రాబడిని ఇచ్చింది.2023, అక్టోబర్ 13 నాటికి దీని ఫండ్ సైజ్ రూ.16,663.52 కోట్లు, NAV రూ.72.60.మీరు మూడేళ్ల క్రితం ఈ ఫండ్‌లో రూ.10,000 ఇన్వెస్ట్ చేసి ఉంటే, అది ఈరోజు రూ.22,060.60కి పెరిగి ఉండేది.మూడు సంవత్సరాల పాటు నెలవారీ రూ.10,000 SIP చేసి ఉంటే, ఈరోజు మీ వద్ద రూ.5,00,065.28 ఉండేవి.ఈ ఫండ్ ఎక్కువగా లార్జ్ క్యాప్ స్టాక్స్ (66.37%), మిడ్ క్యాప్ స్టాక్స్ (11.2%) మరియు స్మాల్ క్యాప్ స్టాక్స్ (2.92%)లో పెట్టుబడి పెట్టింది.ఇది దాని పోర్ట్‌ఫోలియోలో( portfolio ) 54 స్టాక్‌లను కలిగి ఉంది, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐసీఐసీఐ బ్యాంక్, ITC టాప్ హోల్డింగ్‌లుగా ఉన్నాయి.

Telugu Mutual Funds, Size Nav, Hdfc Top, Returns, Iciciprudential, Mutual, Portf

– హెచ్‌డీఎఫ్‌సీ టాప్ 100 ఫండ్:( HDFC Top 100 Fund )

ఈ ఫండ్ గత మూడేళ్లలో సంవత్సరానికి సగటున 26.50% రాబడిని ఇచ్చింది.2023, అక్టోబర్ 13 నాటికి దీని ఫండ్ సైజ్ రూ.26,391 కోట్లు, NAV రూ.934.84.మీరు మూడేళ్ల క్రితం ఈ ఫండ్‌లో రూ.10,000 ఇన్వెస్ట్ చేసి ఉంటే, అది నేడు రూ.20,242కి పెరిగి ఉండేది.మీరు మూడు సంవత్సరాల పాటు నెలవారీ రూ.10,000 SIP చేసి ఉంటే, ఈరోజు మీ వద్ద రూ.475,451.83 ఉండేవి.ఈ ఫండ్ ప్రధానంగా లార్జ్ క్యాప్ స్టాక్‌లలో (76.93%), తర్వాత స్మాల్ క్యాప్ స్టాక్స్ (6.25%), ఇతర (13.64%) స్టాక్‌లలో పెట్టుబడి పెట్టింది.ఇది దాని పోర్ట్‌ఫోలియోలో 49 స్టాక్‌లను కలిగి ఉంది, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ITC టాప్ హోల్డింగ్‌లుగా ఉన్నాయి.

Telugu Mutual Funds, Size Nav, Hdfc Top, Returns, Iciciprudential, Mutual, Portf

– ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ బ్లూ చిప్ ఫండ్:( ICICI Prudential Blue Chip Fund )

ఈ ఫండ్ గత మూడేళ్లలో సంవత్సరానికి సగటున 24.01% రాబడిని ఇచ్చింది.2023, అక్టోబర్ 13 నాటికి దీని ఫండ్ సైజ్ రూ.41,833.49 కోట్లు, NAV రూ.86.48.మీరు మూడేళ్ల క్రితం ఈ ఫండ్‌లో రూ.10,000 ఇన్వెస్ట్ చేసి ఉంటే, అది నేడు రూ.19,069.50కి పెరిగి ఉండేది.మీరు మూడు సంవత్సరాల పాటు రూ.10,000 నెలవారీ SIP చేసి ఉంటే, ఈరోజు మీ వద్ద రూ.4,64,062.08 ఉండేవి.ఈ ఫండ్ ఎక్కువగా లార్జ్ క్యాప్ స్టాక్స్ (76.2%), తర్వాత మిడ్ క్యాప్ స్టాక్స్ (5.31%), స్మాల్ క్యాప్ స్టాక్స్ (0.37%), ఇతర స్టాక్స్ (6.52%)లో పెట్టుబడి పెట్టింది.ఇది దాని పోర్ట్‌ఫోలియోలో 70 స్టాక్‌లను కలిగి ఉంది, ఐసీఐసీఐ బ్యాంక్, L&T, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇన్ఫోసిస్ టాప్ హోల్డింగ్‌లుగా ఉన్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube