బీఆర్ఎస్.. మేనిఫెస్టో పై పొగడ్తలు మళ్లీ కేసీఆరే సీఎం అంటున్న అసదుద్దీన్..!!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై అసదుద్దీన్ ఒవైసీ( Asaduddin Owaisi ) సంచలన వ్యాఖ్యలు చేశారు.తాజాగా జాతీయ మీడియాతో మాట్లాడుతూ… తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్( CM KCR ) గత తొమ్మిది సంవత్సరాలుగా రైతుల కోసం బాగా పనిచేశారని కొనియాడారు.

 Asaduddin Owaisi Says That Kcr Is Cm Again Compliments On Brs Manifesto, Cm Kcr,-TeluguStop.com

ఇదే సమయంలో రైతు బీమా( Rythu Bima )ను ప్రారంభించినట్లు చెప్పుకొచ్చారు.దాన్నే ప్రధాని మోడీ కాపీ కొట్టారని ఆరోపించారు.

కచ్చితంగా వచ్చే ఎన్నికలలో మళ్లీ కేసీఆర్ ని ప్రజలు ముఖ్యమంత్రిగా ఎన్నుకుంటారని తాను భావిస్తున్నట్లు అసదుద్దీన్ స్పష్టం చేయడం జరిగింది.ఇదే సమయంలో బీఆర్ఎస్ ప్రకటించిన మేనిఫెస్టో చాలా బాగుందని అన్నారు.

మైనారిటీలకు బడ్జెట్ పెంచుతామని తెలిపారు.


అదేవిధంగా ప్రజలకు 400 రూపాయలకే గ్యాస్ ఇస్తామని చెప్పటం సంతోషించదగ్గ విషయం.వచ్చే ఎన్నికలలో ఏఐఎంఐఎం ఎన్ని స్థానాలలో పోటీ చేస్తుందనే విషయం.త్వరలో వెల్లడిస్తామని స్పష్టం చేశారు.

ఇదే సమయంలో ఏఐఎంఐఎం పోటీ చేయని చోట బీఆర్ఎస్ పార్టీకే( BRS Party ) తమ మద్దతు ఉంటుందని అన్నారు.ఇంక దేశ విభజనపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

దేశ విభజన చారిత్రాత్మక తప్పిదం.విభజన జరగకుండా ఉండాల్సింది.

కానీ దురదృష్టవశాత్తు జరిగింది.అప్పటి ఇస్లామిక్ పండితులు కూడా ఇరుదేశాల సిద్ధాంతాన్ని వ్యతిరేకించారు.

భారత్.పాక్ విభజన జరగటం దురదృష్టకరం.

దేశ విభజనకు బాధ్యుడు ఎవరు అనే విషయంపై డిబేట్ పెడితే తాను.సంపూర్ణంగా వివరించి చెబుతానని అసదుద్దీన్ ఓవైసీ తెలియజేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube