సీఎం కేసీఆర్ కు రేవంత్ రెడ్డి లేఖ.. ఏం రాశారంటే..?

రాజకీయం అంటేనే రాళ్లు విసురుకోవడం మళ్ళీ చేతులు కలుపుకోవడం.ఇది గల్లీ నుంచి ఢిల్లీ వరకు రాజకీయ నాయకులు అవలంబించే పాలసీ.

 Revanth Reddy's Letter To Cm Kcr.. What Did He Write , Revanth Reddy , Narendra-TeluguStop.com

ప్రస్తుతం తెలంగాణ ( Telangana ) రాష్ట్రంలో ఇంకో కొన్ని నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి.ఇదే తరుణంలో అన్ని పార్టీలు వారి యొక్క అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి.

ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు సంబంధించి ప్రత్యేకంగా సీట్లు కేటాయించాలని బీసీ నాయకులంతా ఏకమై వారి వారి పార్టీలపై ఒత్తిడి తెస్తున్నారు.ఇప్పటికే బీఆర్ఎస్ ( BRS ) నుంచి కొంత మంది బీసీ నేతలకు టికెట్లు కేటాయించారు.

అంతేకాకుండా కాంగ్రెస్ కూడా బీసీలకు ప్రధాన అసెంబ్లీ సీట్లు కేటాయిస్తామని హామీ ఇచ్చింది.

Telugu Brs, Cm Kcr, Congress, Letter, Narendra Modi, Rahul Gandhi, Revanth Reddy

ఇలా రాష్ట్రంలో బీసీ రాగం వినబడుతున్న తరుణంలో కాంగ్రెస్ టీపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి(Revanth reddy) , సీఎం కేసీఆర్ కు బహిరంగ లేఖ రాశారు.ఇంతకీ ఆ లేఖలో ఏం రాశారు అయ్యా అంటే.తెలంగాణలో బీసీ కుల గణన చేపట్టాలని ప్రస్తావించారు.

బీసీ కులగణన డిమాండ్ ఎంతో కాలంగా కొనసాగుతూ వస్తుందని, ఈ కులగణనకు కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతు తెలిపిందని తెలియజేశారు.

Telugu Brs, Cm Kcr, Congress, Letter, Narendra Modi, Rahul Gandhi, Revanth Reddy

బీసీలకు సంబంధించి ఎన్నో ఉద్యమాలు జరిగినప్పుడు, కాంగ్రెస్ పార్టీ వారికి అండగా నిలిచిందని రేవంత్ రెడ్డి లేఖలో రాశారు.మహిళా బిల్లును పార్లమెంటులో ఆమోదం తెలిపిన టైంలో కాంగ్రెస్ అధినాయకుడు రాహుల్ గాంధీ ( Rahul gandhi ) ఈ అంశాన్ని లేవనెత్తారని తెలియజేశారు.ఇప్పటికే బీహార్ బీసీ జన గణన విజయవంతంగా పూర్తయిందని అన్నారు.

బిసి గణన చేయడం వల్లే, బీసీ వర్గాలకు సరైన న్యాయం జరుగుతుందని, రాజ్యాంగం లోని ఆర్టికల్ 15, 16 ప్రకారం ఈ కుల గణన వల్ల విద్య, ఉద్యోగాల్లో బీసీలకు సరైన రిజర్వేషన్ కట్టుదిట్టంగా అమలవుతుందని తెలియజేశారు.ఇక కేంద్రం విషయానికి వస్తే బిజెపి ప్రభుత్వం బీసీ జనగణన డిమాండ్ పట్టించుకోవడంలేదని, బీసీలని చెప్పుకొని అధికారంలోకి వచ్చిన మోడీ ( Modi ) కూడా బీసీ డిమాండ్లను పెడచెవిన పెడుతున్నారని ఆరోపించారు.

తక్షణమే బీసీ కుల గణనతో పాటు సమగ్ర కుటుంబ సర్వే వివరాలను బయట పెట్టాలని లేఖలో ప్రస్తావించారు.ఇలా చేయడం వల్లే బీసీలకు రాజకీయ, ఆర్థిక రంగాల్లో సరైన న్యాయం జరుగుతుందని రేవంత్ రెడ్డి లేఖలో ప్రస్తావించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube