ముఖ్యంగా చెప్పాలంటే గోధుమపిండి రొట్టె( Wheat flour bread )లు నెల రోజులు తినకపోతే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.మన ఆరోగ్యం ఎలా ఉంటుందో మన రోజువారి జీవన శైలి ఆహారపు అలవాట్లు నిర్ణయిస్తాయి.
భారతదేశంతో సహా ప్రపంచ వ్యాప్తంగా గోధుమ పిండిని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉన్నారు.రోటీ, చపాతీ, పూరి వంటివి మన ఆహారంలో ఎంతో ముఖ్యమైనవి.
కాబట్టి మనం వద్దనుకున్న వీటిని దూరం చేసుకోలేము.అయితే ఈ పిండి ఆరోగ్యానికి మంచిది కాదని కొంతమంది పరిశోధకులు చెబుతున్నారు.
ఇది అనేక సమస్యలను కలిగిస్తుందని కూడా చెబుతున్నారు.
నెలరోజుల పాటు గోధుమపిండి రొట్టెలను తినకపోతే ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు( Health benefits ) కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.గోధుమ పిండిలో ఫైబర్, ప్రోటీన్, విటమిన్ బి ఎక్కువగా ఉంటుంది.ఇది బరువు పెరగడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.
మీరు ఒక నెల రోజులపాటు గోధుమ పిండిని తినకపోతే మీ అధిక బరువును( Overweight ) దూరం చేసుకోవచ్చు.అలాగే మీ ఆహారం నుంచి గోధుమపిండిని పూర్తిగా తొలగించాలని దీని అర్థం కాదు.
గోధుమలకు దూరంగా ఉండటం వల్ల పొట్ట నడుము చుట్టూ పేరుకుపోయిన కొవ్వు త్వరగా తగ్గిపోతుంది.గోధుమపిండి రోటీలను అధికంగా తినే ప్రజలలో మలబద్ధకం, అజీర్ణం, గ్యాస్ తో సహా అనేక రకాల సమస్యలు ఉన్నాయి.
నిజానికి అన్నం కంటే గోధుమ పిండితో చేసిన చపాతీలు( Chapatis ), రొట్టెలు జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది.ఇలాంటి అనారోగ్య సమస్యలు ఉన్న వారి కోసం మల్టీ గ్రీన్ పిండిని తయారు చేసుకొని ఉపయోగించవచ్చు.ఇది ఆరోగ్యానికి చాలా మంచిది.మీరు బార్లీ, మిల్లెట్ మరియు రాగి పిండి రోటీలను ఇంట్లో తయారు చేసుకోవచ్చు.వీటితో తయారుచేసిన రోటీలు కూడా గోధుమ పిండితో చేసిన రోటీల లాగే ఉంటాయి.వీటి వల్ల ఆకలి తగ్గుతుంది.
అంతేకాకుండా ఇవి త్వరగా జీర్ణం అవుతాయి.అంతేకాకుండా ఈ పిండిలో ఒత్తిడిని తగ్గించడంలో ఉపయోగపడే ఫైబర్ కూడా ఉంటుంది.
కాబట్టి ఒక నెలరోజుల పాటు మల్టీ గ్రీన్ పిండి( Multi green flour )తో చేసిన రోటీలను తినడం ఆరోగ్యానికి మంచిదని వైద్య నిపుణులు చెబుతున్నారు.