యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ( Prabhas )సినిమా కోసం ఆయన ఫ్యాన్స్ ఎంతగా ఎదురు చూస్తుంటే అంత లేట్ అవుతున్నాయి.ఎన్నో వాయిదాల తర్వాత రిలీజ్ అయిన ఆదిపురుష్ అట్టర్ ప్లాప్ అయ్యింది.
ఏదో ప్రభాస్ క్రేజ్ తో సినిమా ఆ మాత్రం అయినా కలెక్షన్స్ రాబట్టింది.లేదంటే దారుణమైన నష్టాలను చవిచూసేది.ఇక ఈ సినిమా ప్లాప్ తర్వాత ప్రభాస్ నుండి రాబోయే సినిమా కోసం అంతా ఎదురు చూస్తున్నార
ప్రభాస్ లైనప్ లో చాలా క్రేజీ ప్రాజెక్టులు ఉండగా అన్ని కూడా వేటికవే అంచనాలను క్రియేట్ చేసుకున్నాయి.మరి ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్టులలో ”సలార్”( Salaar ) ఒకటి.సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ( Prashanth Neel ) దర్శకత్వంలో ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ తెరకెక్కుతుంది.అన్నీ అనుకున్న విధంగానే జరిగినట్లయితే సలార్ సెప్టెంబర్ 28న అంటే ఈ రోజు రిలీజ్ అయ్యేది.
కానీ ఈ సినిమా కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది.ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కు వాయిదా అంటూ అధికారికంగా ప్రకటించి షాక్ ఇచ్చారు.ఇక తాజాగా ఈ సినిమాను క్రిస్మస్ కానుకగా రిలీజ్ చేయబోతున్నారు అనే వార్తలు వైరల్ అయ్యాయి.డిసెంబర్ 22న ఈ సినిమా క్రిస్మస్ కానుకగా రిలీజ్ కాబోతున్నట్టు తెలుస్తుందిమరి మేకర్స్ నంది అయితే ఇంకా ఎలాంటి క్లారిటీ లేదు.
ఒకవేళ ఇదే నిజమైతే ఈ సినిమాకు భారీ పోటీ తప్పేలా లేదు.ఇదే డేట్ కు షారుఖ్ ఖాన్( Shah Rukh Khan ) నటించిన డంకి సినిమా( Dunki Movie )తో పాటు బాలీవుడ్ మూవీ ఆక్వా మ్యాన్ 2 కూడా రిలీజ్ అవ్వబోతున్నాయి.
దీంతో థియేటర్స్ దగ్గర వార్ తప్పేలా లేదు.సలార్ సినిమాను ఓవర్సీస్ లో భారీ స్థాయిలో రిలీజ్ చేయబోతున్నట్టు ఇప్పటికే కన్ఫర్మ్ అయ్యింది.అయితే ఈ రెండు సినిమాలు పోటీగా ఉండడంతో కొద్దిగా థియేటర్స్ దగ్గర ఇబ్బంది ఏర్పడే ఛాన్స్ ఉందని ట్రేడ్ అనలిస్టులు చెబుతున్నారు.మరి రిలీజ్ డేట్ ఎప్పుడు ప్రకటిస్తారో కలెక్షన్స్ ఎంత రాబడుతుందో చూడాలి.