మహారాష్ట్రలోని( Maharashtra ) థానేలో 10 అడుగుల పొడవైన అల్బినో కొండచిలువ( Albino Python ) కలకలం రేపింది.దాని దురదృష్టం కొద్దీ ఈ పాము కిటికీ గ్రిల్లో ఇరుక్కుంది.
అదే ఇంట్లో నివాసం ఉంటున్న వ్యక్తులు దీన్ని చూసి షాక్ అయ్యారు.ఆ తర్వాత దాన్ని తరిమికొట్టేందుకు ప్రయత్నించారు.
కానీ అది వెళ్లలేదు.చివరికి అది ఇరుక్కుపోయిందని తెలుసుకుని స్నేక్ క్యాచర్స్కి ఫోన్ చేశారు.
దీన్ని విడిపించడానికి ఇద్దరు వ్యక్తులు ప్రయత్నించారు.దానికి సంబంధించిన వీడియో ఇంటర్నెట్లో వైరల్ అయ్యింది.కొండచిలువ పాము సగ భాగం లోపల ఉంటే, మిగతా సగం గ్రిల్ బయట ఉంది, దాని శరీరం చాలా భాగం కిటికీ పైకప్పుపై మిగిలిపోయింది.
అయితే దీనికి విముక్తి కలిగించేందుకు ఒక వ్యక్తి కిటికీలోపల నిలబడి పాము నోటి ముందు భాగాన్ని పట్టుకోగా, మరొక వ్యక్తి కిటికీ బయట నిలబడి పామును వెనుక నుంచి తోసాడు.బయట ఉన్న వ్యక్తి పామును బయటకు తీసుకొచ్చేందుకు కర్రను కూడా వాడాడు.అలా వారు చాలాసేపు కష్టపడ్డాక పాము ఎట్టకేలకు కిటికీ గ్రిల్( Window Grill ) నుంచి బయటపడి ఆపై నేలపై పడిపోయింది.
ఇకపోతే అల్బినో బర్మీస్ పైథాన్ ఒక తెల్ల పాము, ఇది జన్యు పరివర్తన వల్ల వస్తుంది.ఈ పాములు విషపూరితం కానివి. సాధారణంగా మృదు స్వభావాన్ని కలిగి ఉంటాయి, వీటిని పెంపుడు జంతువులుగా కొందరు పెంచుకుంటారు కూడా.అయితే భారతదేశంలో వీటిని పెంచడం చాలా అరుదు.విదేశాల్లో మాత్రం బాగా పెంచుతుంటారు.