టీడీపీ అధినేత చంద్రబాబు స్పెషల్ లీవ్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో రేపు విచారణ జరగనుంది.ఈ మేరకు ఇవాళ చంద్రబాబు తరపు న్యాయవాదులు దాఖలు చేసిన మెన్షన్ మెమోపై సీజేఐ నిర్ణయం తీసుకుంది.
ఈ క్రమంలోనే కేసును ఏ బెంచ్ విచారిస్తుందో సీజేఐ సాయంత్రం వెల్లడించనుంది.అయితే స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో తన రిమాండ్ ను క్వాష్ చేయాలని కోరుతూ చంద్రబాబు సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే ఎస్ఎల్ పీపై సీజేఐ రేపు విచారణ జరుగుతుందని వెల్లడించింది.నిన్న సీజేఐ ముందు చంద్రబాబు తరపు న్యాయవాదులు మెన్షన్ చేశారు.
అందులో భాగంగానే మెమోపై సీజేఐ నిర్ణయం తీసుకుంది.ఈ మేరకు రేపు విచారణ జరగనుంది.