చంద్రబాబు ఎస్ఎల్పీపై రేపు సుప్రీంకోర్టులో విచారణ

టీడీపీ అధినేత చంద్రబాబు స్పెషల్ లీవ్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో రేపు విచారణ జరగనుంది.

ఈ మేరకు ఇవాళ చంద్రబాబు తరపు న్యాయవాదులు దాఖలు చేసిన మెన్షన్ మెమోపై సీజేఐ నిర్ణయం తీసుకుంది.

ఈ క్రమంలోనే కేసును ఏ బెంచ్ విచారిస్తుందో సీజేఐ సాయంత్రం వెల్లడించనుంది.అయితే స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో తన రిమాండ్ ను క్వాష్ చేయాలని కోరుతూ చంద్రబాబు సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలోనే ఎస్ఎల్ పీపై సీజేఐ రేపు విచారణ జరుగుతుందని వెల్లడించింది.నిన్న సీజేఐ ముందు చంద్రబాబు తరపు న్యాయవాదులు మెన్షన్ చేశారు.

అందులో భాగంగానే మెమోపై సీజేఐ నిర్ణయం తీసుకుంది.ఈ మేరకు రేపు విచారణ జరగనుంది.

ఉప్పునీరు తాగడం వల్ల శ‌రీరంలో ఏం జ‌రుగుతుందో తెలుసా?