టిడిపి రాజీనామా అస్త్రాన్ని ప్రయోగించబోతుందా?

తెలుగుదేశం అధినేత చంద్రబాబు( Chandrababu naidu ) అరెస్టు వ్యవహారాన్ని సాధ్యమైనన్నీ రూపాల్లో తెలుగుదేశం అనుకూల మీడియా, పార్టీ నాయకులు చర్చనీయాంశం గా మారుస్తున్న విషయం తెలిసిందే.ఒకవైపు లోకేష్( Nara lokesh ) జాతియ స్థాయి మీడియాతో ఈ విషయంపై ఇంటర్వ్యూలు ఇస్తూ దీనిని దేశవ్యాప్త ఇష్యూ గా మారుస్తూ ఉంటే మరోపక్క తెలుగుదేశం ఎంపీలు పార్లమెంట్లో ఈ విషయంపై ప్రస్తావన తీసుకొస్తూ చంద్రబాబుకి పార్టీకి జరిగిన అన్యాయాన్ని వివరిస్తున్నారు.

 Will Tdp Fire The Resignation Weapon, Tdp , Chandrababu, Tdp Mlas , Chandraba-TeluguStop.com

మరోపక్క కొవ్వొత్తులు ర్యాలీలు నిరసనలు చేస్తూ దీనిని ప్రజల్లో ఆ వేడి తగ్గకుండా చూసుకుంటున్నారు ఇప్పుడు దానికి కొనసాగింపుగా తెలుగుదేశం పార్టీ మరో బ్రహ్మాస్త్రాన్ని తీసుకొస్తున్నట్లుగా తెలుస్తుంది.రానున్న అసెంబ్లీ ఎన్నికలలో చంద్రబాబుకు జరిగిన అన్యాయం పై నిరసన తెలియజేస్తూ మూకుమ్మడిగా తెలుగుదేశం ఎమ్మెల్యేలు రాజీనామా చేయబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

Telugu Ap, Chandrababu, Lokesh, Tdp Mlas, Ys Jagan-Telugu Political News

వైసిపి ప్రతీకార రాజకీయాలకు పాల్పడుతుందని, ప్రజాస్వామ్యం విలువలను దిగజారుస్తుందని అందుకు నిరసనగానే తమ శాసనసభ్యత్వం వదులుకోనున్నట్లుగా తెలుగుదేశం ఎమ్మెల్యేలు ప్రకటించబోతున్నారని తద్వారా ప్రభుత్వంపై ఈ విషయంలో ఒత్తిడి పెంచబోతున్నట్లుగా తెలుస్తుంది.అయితే ఎన్నికలకు ఇంకా ఎక్కువ సమయం లేనందున వీరు రాజీనామా చేసినా నియోజక వర్గాలలో ఉప ఎన్నికలు జరిగే అవకాశం కూడా ఉండదని, గత 2019 ఎన్నికలలో ప్రత్యేక హోదాకు మద్దతుగా వైసీపీ ఎంపీలు ఇదేవిధంగా రాజీనామా చేశారని ఆరు నెలలు కంటే తక్కువ సమయంలో రాజీనామా చేయడం వల్ల వారు మరోసారి ఎన్నికలు ఎదుర్కోవలసిన ఎదుర్కోవాల్సిన అవసరం ఏర్పడలేదని కానీ ఆ మైలేజ్ ను మాత్రం వైసిపి పొందగలిగిందని ఇప్పుడు అదే అస్త్రాన్ని తెలుగుదేశం కూడా రిపీట్ చేయబోతున్నట్లుగా తెలుస్తుంది .

Telugu Ap, Chandrababu, Lokesh, Tdp Mlas, Ys Jagan-Telugu Political News

తమ పదవులకు రాజీనామా చేసి ప్రజల్లో నిత్యం ఉండాలని తద్వారా అరెస్టు తాలూకు మైలేజీని పూర్తిస్థాయిలో దక్కించుకోవాలని తెలుగుదేశం నేతలు ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తుంది.అయితే జగన్ ప్రభుత్వం మొండిగా ముందుగా వెళ్ళి ఉప ఎన్నికలు నిర్వహిస్తే మాత్రం తెలుగుదేశం ఇబ్బందు లు పడుతుందన్న అంచనాలు కూడా ఉన్నాయి.ఉప ఎన్నికలు వచ్చి ఈ నియోజకవర్గాల్లో మరోసారి తెలుగుదేశం అభ్యర్థులు గెలిస్తే పర్వాలేదు కానీ ఒకవేళ ఓడిపోతే మాత్రం అది వచ్చే ఎన్నికలకు రెపరెండం గా జగన్ ప్రభుత్వం( CM ys jagan ) చూపించుకునే అవకాశం ఉంది.అందువల్ల అన్ని రకాలుగా ఆలోచించి సరైన సందర్భం చూసి రాజీనామా చేయాలని తెలుగుదేశం పార్టీ భావిస్తున్నట్లుగా తెలుస్తుంది

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube