ఆ రాష్ట్రంలో 26 వేళ్లతో పుట్టిన చిన్నారి.. అమ్మవారి అవతారమంటూ పూజలు చేయడంతో?

సాధారణంగా చేతికి లేదా పాదాలకు ఆరు వేళ్లు ఉంటేనే ఆశ్చర్యంగా చూస్తాం.కొంతమంది స్టార్ హీరోలకు, స్టార్ హీరోయిన్లకు( star heroes , star heroines ) సైతం ఆరు వేళ్లు ఉన్నాయి.

 A Girl Born With 26 Fingers Details Here Goes Viral In Social Media , Sarju Devi-TeluguStop.com

అయితే చేతులకు, కాళ్లకు మొత్తం 26 వేళ్లు ఉండటం ఎప్పుడూ జరగలేదు.రాజస్థాన్ రాష్ట్రంలోని ఢీగ్ జిల్లాలోని కామా అనే ఊరులో 26 వేళ్లతో ఒక చిన్నారి జన్మించడం గమనార్హం.

రెండు చేతులకు వేర్వేరుగా ఏడు వేళ్లు ఉండగా రెండు పాదాలకు వేర్వేరుగా 6 వేళ్లు ఉన్నాయి.

సర్జూ దేవి, గోపాల్ భట్టాచార్య ( Sarju Devi and Gopal Bhattacharya )దంపతులకు జన్మించిన ఈ చిన్నారిని చూసి నెటిజన్లు సైతం ఆశ్చర్యపోతున్నారు.

గ్రామ ప్రజలు ఆ చిన్నారి అమ్మవారి అవతారమంటూ పూజలు చేస్తుండటం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది.తమ కూతురును దేవతా అవతారమని చెబుతుండటంతో చిన్నారి తల్లీదండ్రులు సైతం ఎంతగానో సంతోషిస్తున్నారని సమాచారం అందుతుండటం గమనార్హం.

Telugu Fingers, Born Fingers, Born, Sarjudevi-General-Telugu

చిన్నారి 26 వేళ్లతో జన్మించడం గురించి వైద్యులు మాట్లాడుతూ ఈ చిన్నారి కేసు చాలా అరుదైన కేసు అని వెల్లడించారు.జన్యుపరమైన సమస్యల వల్ల చిన్నారి 26 వేళ్లతో జన్మించడం జరిగిందని వాళ్లు వెల్లడిస్తున్నారు.తల్లి, బిడ్డ ఆరోగ్యంగానే ఉన్నారని వైద్యులు వెల్లడిస్తున్నారు.గోపాల్ భట్టాచార్య సీఆర్‌పీఎఫ్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా పని చేస్తుండగా భార్య సర్జూ దేవి గృహిణి అని సమాచారం.

Telugu Fingers, Born Fingers, Born, Sarjudevi-General-Telugu

ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతుండగా నెటిజన్లు చిన్నారిని దేవతలా పూజించడం గురించి భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.చిన్నారిని జాగ్రత్తగా చూసుకోవాలని తల్లీదండ్రులకు( parents ) నెటిజన్లు సూచనలు చేస్తున్నారు.చిన్నారికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతున్నాయి.ఎక్కువ సంఖ్యలో వేళ్లు ఉండటం వల్ల భవిష్యత్తులో చిన్నారి ఇబ్బంది పడే అవకాశాలు అయితే ఉన్నాయని కొంతమంది సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తుండటం గమనార్హం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube