రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబుతో పవన్ ములాఖత్

ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కుంభకోణం కేసులో అరెస్ట్ అయి రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబుతో ఇవాళ జనసేన అధినేత పవన్ కల్యాణ్ ములాఖత్ కానున్నారు.

 Pawan Mulakhat With Chandrababu In Rajahmundry Central Jail-TeluguStop.com

ఈ మేరకు కాసేపటిలో జనసేనాని రాజమండ్రికి చేరుకోనుండగా బాలకృష్ణ, లోకేశ్ తో కలిసి పవన్ సెంట్రల్ జైలుకు వెళ్లనున్నారని తెలుస్తోంది.

ములాఖత్ కానున్న పవన్ చంద్రబాబును పరామర్శించి ఆరోగ్యం, భద్రత గురించి తెలుసుకోనున్నారు.చంద్రబాబుతో ములాఖత్ తరువాత ముగ్గురు నేతలు కీలక సమావేశం నిర్వహించి భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారని సమాచారం.

కాగా ఇందుకోసం పవన్ బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి ఇప్పటికే బయలు దేరారు.ఈ నేపథ్యంలో రాజమండ్రి జైలు వద్ద పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube