ఊహలు గుసగుసలాడే సినిమా తో హీరోయిన్ గా మంచి గుర్తింపు దక్కించుకున్న ముద్దుగుమ్మ రాశి ఖన్నా( Raashi Khanna ).ఈ అమ్మడు తెలుగు లో పోషించిన పాత్ర లకు ప్రతి ఒక్కరు కూడా ఫిదా అయ్యారు.
అయితే ఎన్టీఆర్ తో జై లవ కుశ సినిమా లో మినహా పెద్దగా సినిమా ల్లో నటించే అవకాశాలు దక్కలేదు.టైర్ 2 హీరో ల సినిమా ల్లో నటించిన ఈ అమ్మడు ఒకానొక సమయంలో ఫుల్ బిజీగా కొనసాగింది.
కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు.
ముద్దుగుమ్మ రాశి ఖన్నా గతంలో మాదిరిగా వరుస సినిమా ల్లో చేయాలని ఆశ పడ్డా కూడా ప్రస్తుతం ఆఫర్లు దక్కడం లేదు.తెలుగు సినిమా ఇండస్ట్రీ ( Tollywood )లో అసలు ఈమెకు ఛాన్స్ లు లేవు.దాంతో ఈమె ఏం చేస్తుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
సినిమా ల్లోనే కాకుండా సిరీస్ ల్లో కూడా ఈమె నటించేందుకు ఓకే అంటోంది.కానీ సిరీస్ మేకర్స్ కూడా ఎవరు రాశి ఖన్నా వైపు చూడటం లేదు.
ఒకప్పుడు టైర్ 2 హీరో లు రాశి ఖన్నా తో నటించేందుకు చాలా ఆసక్తి చూపించేవారు.కానీ ఇప్పుడు వారు కూడా రాశి ఖన్నా ను పట్టించుకోవడం లేదు పాపం.రాశి ఖన్నా హీరోయిన్ గా తమిళం( Kollywood ) లో ఒకటి రెండు సినిమా లు రూపొందుతున్నాయి.ఆ రెండు సినిమా ల విషయానికి వస్తే అవి కూడా చిన్నవే.
కనుక అవి మంచి విజయాన్ని సొంతం చేసుకుని తమిళం లో వరుస సినిమా లు చేస్తే అప్పుడు తెలుగు లో ఏమైనా అవకాశాలు దక్కుతాయేమో చూడాలి.తెలుగు లో రాశి ఖన్నా ని పట్టించుకోక పోతే కెరీర్ క్లోజ్ అయినట్లే.
అయితే సోషల్ మీడియా లో ఈ అమ్మడి అందాల ఆరబోత కి చాలా మంది నెటిజన్స్ ఫిదా అవుతున్నారు.కనుక ఆ అందాల ఆరబోత తో అయినా ఈ అమ్మడు ఆఫర్లు దక్కించుకుంటుందేమో చూడాలి.