ఇటీవల కాలంలో తెలంగాణలో కాంగ్రెస్( Telangana elections ) బాగా బలం పెంచుకుంది.అధికారంలోకి వస్తామనే దేమా ఆ పార్టీ నేతల్లో కనిపిస్తోంది.
ఈ నేపథ్యంలోని బిఆర్ఎస్ ,బిజెపిలలో నెలకొన్న పరిస్థితులు కాంగ్రెస్ కు బాగా కలిసి వస్తున్నాయి.ప్రస్తుతం అభ్యర్థుల ఎంపికపైనే కాంగ్రెస్ పూర్తిగా దృష్టి సారించింది.
ఇప్పటికే దరఖాస్తుల ప్రక్రియ పూర్తి కావడంతో అభ్యర్థుల ఎంపిక పైన స్క్రీనింగ్ కమిటీ దృష్టి సాధించింది మరికొద్ది రోజుల్లోనే అభ్యర్థులను ప్రకటించేందుకు సిద్ధమవుతోంది.ఇక తెలంగాణ కాంగ్రెస్ పై ఆ పార్టీ అధిష్టానం కూడా ప్రత్యేకంగా దృష్టి సారించింది .ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు ఆ పార్టీ అగ్రనేతలు సిద్ధమవుతున్నారు .దీనిలో భాగంగానే హైదరాబాద్ వేదికగా రెండు రోజులపాటు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాలు నిర్వహించబోతున్నారు.సెప్టెంబర్ 16 , 17న హైదరాబాదులో జరిగే సిడబ్ల్యూ సి సమావేశాల్లో కాంగ్రెస్ అగ్రనేతలైన సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే , రాహుల్ ,( Rahul Gandhi ) ప్రియాంక గాంధీతో పాటు, ఆ పార్టీ కీలక నాయకులంతా పాల్గొనబోతున్నారు.
అలాగే తెలంగాణ విలీన దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని కాంగ్రెస్( Congress ) నిర్ణయించింది.పురస్కరించుకుని అదే రోజు సోనియా గాంధీ ముఖ్య అతిథిగా సోనియా, మల్లిఖార్జున ఖర్గే , రాహుల్ గాంధీ తదితరులు హాజరుకానున్నారు.ఈ నేపథ్యంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
దీంతో పాటు ప్రతి నియోజకవర్గంలో పార్టీ నేతలు పర్యటించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. కాంగ్రెస్ అగ్ర నేతలతో పాటు ,సీనియర్ నేతలు ఒక్కో నియోజకవర్గంలో పర్యటించి కేంద్ర పాలిత రాష్ట్రాల్లో అమలు అవుతున్న సంక్షేమ పథకాలను గురించి వివరించనన్నారు.
అలాగే తెలంగాణలో తప్ప దేశంలో ఎక్కడా సంక్షేమ పథకాలు అమలు కావడంలేదని బీఆర్ఎస్ నేతలు ప్రచారం చేసుకుంటున్న నేపథ్యంలో , ఆ ప్రచారానికి చెక్ పెట్టేందుకు కాంగ్రెస్ సిద్ధమవుతోంది.
రాజస్థాన్, ఛత్తిస్ ఘడ్, కర్ణాటక , హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను తెలంగాణ ప్రజలకు వివరించాలని నిర్ణయించుకున్నారు.కాంగ్రెస్ అగ్ర నాయకులంతా తెలంగాణలో పర్యటించి తెలంగాణకు కాంగ్రెస్ ఎంత ప్రాధాన్య ఇస్తుందో అనే విషయాన్ని ప్రజల్లోకి పంపించాలని నిర్ణయించుకున్నారు. సాంప్రదాయ ఓటర్లు కాంగ్రెస్ వైపు తిరిగి వస్తారని భావిస్తున్నారు .తెలంగాణలో పర్యటించడం ద్వారా ఎన్నికల వాతావరణాన్ని సృష్టించవచ్చని, ఇవన్నీ కాంగ్రెస్ కు అనుకూలంగా మారుతాయని ఆ పార్టీ నేతలు నమ్ముతున్నారు.అందుకే సి డబ్ల్యూ సి సమావేశాలను విజయవంతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ సమావేశాల్లోనే పార్టీ మేనిఫెస్టోను విస్తృతంగా ప్రచారం చేయాలని నిర్ణయించుకున్నారు. సోనియా గాంధీ ( Sonia Gandhi )చేతులమీదుగా మేనిఫెస్టోను విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈనెల 17వ తేదీన పెరేడ్ గ్రౌండ్ లో భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి.