తెలంగాణలో ఎన్నికలు దగ్గరపడే కొద్ది పోలిటికల్ హీట్ రోజురోజుకూ రెట్టింపవుతోంది.ప్రధాన పార్టీలన్నీ గెలుపుకోసం గట్టిగా ప్రయత్నిస్తుండడంతో ఆ పార్టీల వ్యూహా ప్రతివ్యూహాలు రాష్ట్ర రాజకీయాల్లో కాకరేపుతున్నాయి.
ఎన్నికలకు కేవలం మూడు నెలలు మాత్రమే సమయం ఉండడంతో ఈ కొద్ది సమయంలో ప్రజల్లో పార్టీల గ్రాఫ్ పెంచడంతో పాటు బరిలో నిలిచే అభ్యర్థుల విషయంలో స్పెషల్ ఫోకస్ పెడుతున్నాయి ప్రధాన పార్టీలు.ఇప్పటికే అధికార బిఆర్‌ఎస్ తొలి జాబితా ను ప్రకటించి ఎలక్షన్ రేస్ లో ముందుంది.
అటు కాంగ్రెస్( Congress party ) కూడా జాబితాను ఫైనల్ చేసే పనిలో నిమగ్నమైంది.కానీ బీజేపీ( BJP party ) మాత్రం స్లో అండ్ స్టడీ వైఖరిని కొనసాగిస్తోంది.
కర్నాటక ఎన్నికల్లో ఓటమి తరువాత చాలావరకు దూకుడు తగ్గించిన కమలం పార్టీ.ఎన్నికలు దగ్గర పడుతున్నప్పటికి నిన్న మొన్నటి వరకు అంతే నిర్లక్ష్యంగా ఉండడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసిన అంశం.ఒకవైపు బిఆర్‌ఎస్ ( BRS )కాంగ్రెస్ పార్టీలు అభ్యర్థుల విషయంలో నువ్వా నేనా అన్నట్లు పోటీ పడుతున్నప్పటికి బీజేపీ మాత్రం నిమ్మకు నిరెత్తినట్లు ఉంది.అయితే కాషాయ నేతలు ఇంత స్లో అవ్వడానికి కారణం కూడా లేకపోలేదు.
ఈ మద్య ఆ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు బాగా పెరిగిపోయాయి.ఫలితంగా పార్టీలోని కీలక నేతలంతా ఎవరికి వారే యెమున తీరే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.
అయితే ఇలాగే ఉంటే పార్టీకి ప్రమాదం తప్పదని గ్రహించిన అధిష్టానం.ఇక అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది, నేటి నుంచి 10వ తేదీ వరకు ఆశావాహుల నుంచి దరఖాస్తుల స్వీకరణ మొదలు పెట్టనుంది. కాంగ్రెస్ పార్టీ( Congress party ) కూడా ఇలా దరఖాస్తుల ప్రక్రియ ద్వారానే అభ్యర్థుల ఎంపిక చేపడుతున్న సంగతి తెలిసిందే.ఇప్పుడు బీజేపీ కూడా అదే దారిలో వెళుతోంది.
నియోజిక వర్గాల వారీగా బీజేపీకి బలమైన నేతల కొరత చాలా ఉంది.ఈ నేపథ్యంలో ఎవరిని బరిలో నిలపలనే దానిపై కమలం నేతలలో క్లారిటీ లేదు.
అందుకే దరఖాస్తుల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక చేపట్టి ఆ తరువాత మార్పులు చేర్పులు చేపట్టే అవకాశం ఉంది.మరి అభ్యర్థుల ఎంపిక విషయంలో ఒకే దారిలో నడుస్తున్న కాంగ్రెస్, బీజేపీ పార్టీల.
తొలి జాబితా ఎలా ఉండబోతుందో చూడాలి.