ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు , తెలంగాణ రాజకీయాల్లో కీలక నేతగా ఉన్న బీఆర్ఎస్ నాయకుడు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరావు( Tummala nageswararao ) కోసం బిజెపి పెద్ద స్కెచ్ వేస్తోంది .తుమ్మలను బిజెపి( BJP party )లో చేర్చుకుంటే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రభావం చూపించవచ్చని ఆ పార్టీ నమ్ముతోంది.
మొన్నటి వరకు ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి( Ponguleti Srinivasa Redd )ని చేర్చుకునేందుకు చాలా ప్రయత్నాలు చేసింది.స్వయంగా ఈటెల రాజేందర్ నివాసానికి వెళ్లి ఆయనతో చర్చలు జరిపారు .అప్పట్లో పొంగులేటి బిజెపిలో చేరాలని చూసినా, తన నిర్ణయాన్ని మార్చుకుని కాంగ్రెస్ లో చేరిపోయారు దీంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బలమైన నేత కోసం ఎదురు చూస్తున్న బిజెపి దృష్టి ఇప్పుడు తుమ్మల నాగేశ్వరరావు పై పడింది.ఆయనను ఏదో రకంగా ఒప్పించి పార్టీలో చేర్చుకుంటే తమకు కలిసి వస్తుందని, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బిజెపి బలం అంతంత మాత్రమే అన్నట్టుగా ఉండడంతో , తుమ్మల ద్వారా పార్టీనీ బలోపేతం చేసి , వచ్చే ఎన్నికల్లో కొన్ని స్థానాల్లోనైనా గెలవచ్చనే లెక్కల్లో బిజెపి ఉంది.
అందుకే ఆయనను పార్టీలో చేర్చుకునేందుకు చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.ప్రస్తుతానికి బీఆర్ఎస్ లో తుమ్మల ఉన్నారు.చాలాకాలం పాటు తనుకు సరైన రాజకీయ ప్రాధాన్యం దక్కడం లేదనే అసంతృప్తితో ఆయన ఉంటున్నారు.ఎన్నోసార్లు పార్టీ మారుతున్నారని ప్రచారం జరిగినా తుమ్మల మాత్రం సైలెంట్ గానే ఉన్నారు.
ఏ నిర్ణయం తీసుకోలేదు.ఇక తుమ్మలకు రాజ్యసభ సభ్యత్వం ఇవ్వబోతున్నారని హడావుడి బిఆర్ఎస్ లో జరుగుతోంది.
అయితే ప్రత్యక్ష రాజకీయాల్లో ప్రభావం చూపించాలని చూస్తున్న తుమ్మల వచ్చే ఎన్నికల్లో పాలేరు నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి పోటీ చేసే ఆలోచనతో ఉన్నారు.గత ఎన్నికల్లో పాలేరు నియోజకవర్గం నుంచి తుమ్మల నాగేశ్వరావు పోటీ చేసి ఓటమి చెందారు.
ఆయనపై కాంగ్రెస్ అభ్యర్థి కందాల ఉపేందర్ రెడ్డి విజయం సాధించారు.ఆ తర్వాత ఆయన కూడా బీఆర్ఎస్( BRS party ) లో చేరడంతో, వచ్చే ఎన్నికల్లో ఉపేందర్ రెడ్డి కే టికెట్ ఖరారు కావడంతో తుమ్మల కూడా ఆలోచనలో పడ్డారు .
దీన్ని అవకాశం తీసుకున్న బిజెపి తుమ్మలతో చర్చలు జరుపుతోంది.ఆయన పార్టీలో చేరితే పాలేరు నియోజకవర్గంతో పాటు, కొన్ని నియోజకవర్గాల్లో తుమ్మల అనుచరులకు టికెట్లు ఇచ్చేందుకు సిద్ధమనే సంకేతాలు కూడా ఇస్తూ ఉండడంతో , దీనిపై ‘తుమ్మల ‘ ఏం నిర్ణయం తీసుకోబోతున్నరనేది మరికొద్ది రోజుల్లో తేలనుంది.ఈనెల 27న అమిత్ షా బహిరంగ సభ ఖమ్మంలో నిర్వహిస్తున్నారు.ఆ సభ లోనే తుమ్మలను పార్టీలో చేర్చుకునే విధంగా ప్రయత్నాలు ముమ్మరం చేసింది.