బోట్ కంపెనీ( Boat Company ) అనగానే మనకు టక్కున వైర్ లెస్ ఇయర్ బడ్స్, హెడ్ ఫోన్స్, స్మార్ట్ వాచ్, సౌండ్ బార్స్ వంటివి గుర్తొస్తాయి.తన నాణ్యమైన ప్రొడక్ట్‌లతో భారతీయులలో ఈ కంపెనీ ఎంతో పేరు సంపాదించింది.
అందుబాటు ధరలో వివిధ ప్రొడక్టులను ఉంచడంతో పాటు లగ్జరీ స్థాయి ప్రొడక్టులనూ విక్రయిస్తోంది.ఎప్పటికప్పుడు సరికొత్త మోడల్స్‌ను మార్కెట్లోకి విడుదల చేస్తోంది.
తాజాగా సరికొత్త సౌండ్‌బార్‌ను( Soundbar ) ఈ కంపెనీ మార్కెట్లోకి తీసుకొచ్చింది.ఎంతో నాణ్యతతో కూడిన ఈ సౌండ్ బార్‌పై కంపెనీ 57 శాతం డిస్కౌంట్ అందిస్తోంది.
వివిధ బ్యాంకుల క్రెడిట్/డెబిట్ కార్డులతో మరి కొంత డిస్కౌంట్‌ను సైతం అదనంగా పొందొచ్చు.ఇలా సగం కంటే తక్కువ ధరకే సరికొత్త నాణ్యమైన సౌండ్ బార్‌ను మనం సొంతం చేసుకోవచ్చు.
దీనికి గురించిన ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.
ప్రస్తుతం మార్కెట్లో ఖరీదైన టీవీలు అందుబాటులో ఉన్నాయి.వాటిని కొనుగోలు చేసినప్పుడు వాటితో పాటు సౌండ్ బార్లను కూడా అంతా కొంటున్నారు.అయితే నాణ్యమైన సౌండ్ బార్ ఎంచుకుంటేనే తగిన ఆడియో ఫీల్ మనం పొందుతాం.
భారతీయ మార్కెట్లోకి బోట్ కంపెనీ బోట్ అవంటే బార్ 520 ( Boat Avante Bar 520 )పేరుతో సరికొత్త నాణ్యమైన సౌండ్ బార్‌ను విడుదల చేసింది.దీని అసలు ధర రూ.3,999.అయితే దీనిపై కంపెనీ తన వెబ్సైట్లోనే నేరుగా భారీ డిస్కౌంట్‌ను ప్రకటించింది.57 శాతం డిస్కౌంట్‌తో రూ.1,699కి దీనిని వినియోగదారులకు అందుబాటులో ఉంచింది.ఫ్లిప్‌కార్ట్‌లో దీనిని రూ.200 తక్కువ ధరకు కొనుగోలు చేయొచ్చు.అంటే రూ.1499కి ఇది మనకు లభిస్తుంది.దీని ప్రత్యేకతల విషయానికొస్తే అవంటే బార్ 520 సౌండ్‌బార్ 16 వాట్స్ పవర్, డ్యూయల్ పాసివ్ రేడియేటర్లతో స్పష్టమైన, బలమైన సౌండ్ అందిస్తుంది.ఇది 2.0 ఛానెల్ స్టీరియో సౌండ్ సెటప్‌ను కలిగి ఉంది.మీరు బ్లూటూత్ వి5.0ని ఉపయోగించి వైర్‌లెస్‌గా దీనికి కనెక్ట్ చేయవచ్చు.ఒక్కసారి ఛార్జ్ చేస్తే 6 గంటల వరకు దీనిని వినియోగించుకోవచ్చు.
డిజైన్, కాంపాక్ట్ పరిమాణం చాలా ఆకర్షణీయంగా ఉంది.