ముడ‌త‌ల‌ను మాయం చేసి ముఖాన్ని గ్లోగా మార్చే న్యాచుర‌ల్ క్రీమ్ మీకోసం!

ప్ర‌స్తుత రోజుల్లో చాలా మంది చిన్న వ‌య‌సులోనే ముడ‌త‌ల స‌మ‌స్య‌ను ఫేస్ చేస్తున్నారు.కాలుష్యం, ఆహార‌పు అల‌వాట్లు, పోషకాల కొర‌త‌, చ‌ర్మ సంర‌క్ష‌ణ లేక‌పోవ‌డం, హార్మోన్ ఛేంజ‌స్ వంటి ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల యంగ్ ఏజ్‌లోనే చ‌ర్మంపై ముడ‌త‌లు ఏర్ప‌డుతుంటాయి.

 Natural Cream That Get Rid Of Wrinkles And Makes The Face Glow Is For You , Natu-TeluguStop.com

దాంతో వాటిని త‌గ్గించుకోవ‌డం కోసం నానా ప్ర‌య‌త్నాలు చేస్తుంటారు.ఈ క్ర‌మంలోనే వేల‌కు వేలు చ‌ర్మం కోసం ఖ‌ర్చు పెడుతుంటారు.

అయితే ఇప్పుడు చెప్ప‌బోయే న్యాచుర‌ల్ క్రీమ్‌ను యూజ్ చేస్తే గ‌నుక కేవ‌లం నెల రోజుల్లో ముడ‌త‌లు మాయమై ముఖం గ్లోగా మారుతుంది.

మ‌రి ఇంకెందుకు లేటు ఆ న్యాచుర‌ల్ క్రీమ్‌ను ఎలా త‌యారు చేసుకోవాలో తెలుసుకుందాం ప‌దండీ.

ముందుగా గిన్నె తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ల తేనె, ఒక క‌ప్పు వాట‌ర్‌, వ‌న్ టేబుల్ స్పూన్ కార్న్‌ఫ్లోర్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.ఆ త‌ర్వాత ఈ మిశ్ర‌మాన్ని స్ట‌వ్‌పై పెట్టి.

గ‌రిటెతో తిప్పుకుంటూ స్లో ఫ్లేమ్‌పై ఐదు నుంచి ప‌ది నిమిషాల పాటు ఉడికించాలి.

Telugu Tips, Cornflower, Face, Honey, Latest, Natural Cream, Skin Care, Skin Car

ఇలా చేస్తే అది క్రీమీ స్ట్రక్చర్‌లోకి మారుతుంది.అప్పుడు స్ట‌వ్ ఆఫ్ చేసి ఉడికించుకున్న మిశ్ర‌మాన్ని చ‌ల్లార‌బెట్టుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్ర‌మంలో రెండు టేబుల్ స్పూన్ల అవిసె గింజ‌ల జెల్‌, రెండు చుక్క‌లు విట‌మిన్ ఇ ఆయిల్ వేసుకుని హ్యాండ్ బ్లెండ‌ర్ సాయంతో రెండు నిమిషాల పాటు క‌లిపితే క్రీమ్ సిద్ధ‌మైన‌ట్టై.

దీనిని ఒక‌ బాక్సాలో నింపుకుని ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకుంటే ప‌ది నుంచి ప‌దిహేను రోజుల పాటు యూజ్ చేసుకోవ‌చ్చు.

ఈ న్యాచుర‌ల్ క్రీమ్‌ను ఎలా వాడాలంటే.స్నానం చేయ‌డానికి రెండు గంట‌ల ముందు ముఖానికి అప్లై చేసుకుని స్మూత్‌గా మ‌సాజ్ చేసుకోవాలి.లేదా రాత్రి నిద్రించే ముందు వాట‌ర్‌తో ఫేస్ వాష్ చేసుకుని.

ఆపై త‌యారు చేసుకుని క్రీమ్‌ను రాసుకుని లైట్‌గా మసాజ్ చేసుకుని ప‌డుకోవాలి.ఇలా ఎలా చేసినా కూడా ముడ‌త‌లు త‌గ్గి ముఖం కాంతివంతంగా, మృదువుగా మారుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube