వారాహి గాజువాక సభలో సీఎం జగన్ పై పవన్ సీరియస్ కామెంట్స్..!!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan kalyan ) నిర్వహిస్తున్న వారాహి విజయయాత్ర ప్రస్తుతం విశాఖ జిల్లాలో కొనసాగుతుంది.నాలుగో విడత యాత్రలో భాగంగా ఆదివారం గాజువాకలో నిర్వహించిన వారాహి యాత్ర బహిరంగ సభలో సీఎం జగన్ పై పవన్ కళ్యాణ్ సీరియస్ వ్యాఖ్యలు చేశారు.

 Pawan's Serious Comments On Cm Jagan In Varahi Gajuwaka Sabha Janasena, Pawan K-TeluguStop.com

వచ్చే ఎన్నికలలో రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చిన పర్వాలేదు.మళ్లీ జగన్ అధికారంలోకి మాత్రం రాకూడదని పవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఆస్తులు అమ్మేందుకు ప్రజలు మీకు అధికారం ఇచ్చారా.? జగన్( YS Jagan Mohan Reddy ) మళ్లీ వస్తే భరించలేం.గద్దెపై కూర్చుని ఆకృత్యాలు చేస్తే.జనం చూస్తూ ఊరుకోరు.ప్రజలు మేల్కొన్నారు.జగన్ గద్దె దిగక తప్పదు.

జగన్ ను దేవుడు అని మొక్కాం.దయ్యమై జనాన్ని పట్టుకున్నారు.అనీ పవన్ తీవ్ర స్థాయిలో విమర్శించారు.151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలను గెలుచుకున్న వైసీపీ ప్రజలకు( YCP ) చేసింది ఏమీ లేదని మండిపడ్డారు.అవినీతి, అక్రమాలు, భూకబ్జాలకు పాల్పడుతూ రాజ్యమేలుతున్న వైసీపీ ప్రభుత్వానికి వచ్చే ఎన్నికలలో చరమగీతం పాడాల్సిన సమయం ఆసన్నమైందని గాజువాక సభలో పవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube