35కి.మీ రేంజ్, కి.మీకి 7 పైసలే ఖర్చు.. ఆకట్టుకుంటున్న కొత్త ఎలక్ట్రిక్-సైకిల్‌!

పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిన వేళ భారతీయులందరూ ఎలక్ట్రిక్ వాహనాల( Electric vehicles ) వైపు మొగ్గు చూపుతున్నారు.ఈ క్రమంలో కంపెనీలు సరికొత్త ఎలక్ట్రిక్ సైకిల్స్, స్కూటర్లు, బైక్స్, కార్లు లాంచ్ చేస్తున్నాయి.

 35 Km Range, Cost Of 7 Paise Per Km Impressive New Electric-cycle , Stryder Cyc-TeluguStop.com

పేద, మధ్యతరగతి వారికి అందుబాటు ధరల్లో ఉండేలా కూడా ఇవి వాహనాలను పరిచయం చేస్తున్నాయి.ఈ నేపథ్యంలోనే స్ట్రైడర్ సైకిల్స్ కంపెనీ( Strider Cycles Company ) రూ.29,995కే జీటా మ్యాక్స్ అనే అదిరిపోయే ఎలక్ట్రిక్ సైకిల్ లాంచ్ చేసింది.దీనిపై ఒక కిలోమీటర్ ప్రయాణం చేస్తే కేవలం 7 పైసలు మాత్రమే ఖర్చవుతుందని కంపెనీ చెబుతోంది.దీని అసలు ధర రూ.36,995 కాగా లాంచ్ ఆఫర్ కింద రూ.29,995కే సొంతం చేసుకోవచ్చు.ఇది మాట్ గ్రే, మాట్ బ్లూ అనే రెండు కలర్ ఆప్షన్స్‌లో లభిస్తుంది.

జీటా మ్యాక్స్ ఎలక్ట్రిక్ సైకిల్ తక్కువ దూర ప్రయాణాలకు లేదా ఫ్రీ టైమ్ రైడ్స్‌కు ఉత్తమంగా నిలుస్తుంది.ఇది గరిష్ఠంగా గంటకు 25 కి.మీ వేగంతో దూసుకెళ్తుంది.కాబట్టి సిటీ ట్రాఫిక్‌ను ఈజీగా దాటుకుని వెళ్ళవచ్చు.ఇందులో అందించిన బ్యాటరీ 36 V 7.5 Ah కాగా ఇది సింగిల్ ఛార్జింగ్ పై 35 కి.మీల దూరం ప్రయాణించగలదు, కాబట్టి మీరు ఛార్జింగ్ అయిపోతుందనే భయం లేకుండా చాలా దూరం వెళ్లవచ్చు.250W BLDC మోటార్‌తో నడిచే ఇది 270 Wh ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తుంది.

Telugu Eletric Cycles, Eletric Cycle, Bicycles, Stryder Cycles, Zeeta Max-Latest

జీటా మ్యాక్స్( Zeta Max ) ఎగుడుదిగుడుగా ఉన్న రోడ్లపై ప్రయాణించేందుకు సౌకర్యంగా ఉండేలా ఫ్రంట్ సస్పెన్షన్‌ను ఆఫర్ చేస్తుంది.ఇది పెడల్ అసిస్ట్ లెవెల్ 5తో వస్తుంది.అవసరమైన పవర్ లెవెల్ ఎంచుకోవచ్చు.తక్కువ లెవెల్ పెడల్ అసిస్టెంట్ ఎంచుకోవడం ద్వారా ఫిట్‌నెస్ పెంచుకోవచ్చు.జీటా మ్యాక్స్‌ ఎలక్ట్రిక్ సైకిల్‌లో బ్యాటరీ ఎంత మిగిలి ఉంది, మీరు ఎంత దూరం సైకిల్ తొక్కారు, మీరు ఏ లెవెల్ పెడల్ అసిస్ట్‌ని ఉపయోగిస్తున్నారు వంటి వాటిని చూపే ఎల్‌సీడీ స్క్రీన్‌( LCD screen ) కూడా ఉంటుంది.బైక్‌ను వేగంగా లేదా నెమ్మదిగా వెళ్లేలా చేయడానికి మీరు పెడల్ అసిస్ట్ స్థాయిని మార్చవచ్చు.

బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేయడానికి 3-4 గంటలు పడుతుంది.బలమైన, మన్నికైన స్టీల్ హార్డ్‌టెయిల్ ఫ్రేమ్ దీనిలో ఆఫర్ చేశారు.

Telugu Eletric Cycles, Eletric Cycle, Bicycles, Stryder Cycles, Zeeta Max-Latest

జీటా మ్యాక్స్ ఛార్జ్ చేయడం సులభం, సేఫ్టీ కోసం ఇది ఆటో-కట్ బ్రేక్‌లతో వస్తుంది.ఇది వారంటీ ద్వారా కూడా మద్దతునిస్తుంది, కాబట్టి ఇది క్వాలిటీ ఎలక్ట్రిక్ సైకిల్ అని అర్థం చేసుకోవచ్చు.జీటా మ్యాక్స్ అనేది సరసమైన, నమ్మదగిన, ఉపయోగించడానికి సులభమైన ఎలక్ట్రిక్ సైకిల్ కోసం చూస్తున్న వారికి ఒక బెస్ట్ ఛాయిస్ అవుతుంది.ఇది ప్రయాణాలకు, ఫ్రీ టైమ్ రైడ్స్‌కి లేదా తేలికపాటి ఆఫ్-రోడ్ సాహసాలకు కూడా సరైనది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube