రాహుల్ గాంధీ మనసు బంగారం.. కిందపడిన వ్యక్తికి ఎలా హెల్ప్ చేశారో చూడండి!

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్ గాంధీ( Rahul Gandhi ) తాజాగా చేసిన ఓ పని అందరి నుంచి ప్రశంసలు అందుకుంటోంది.నిన్న ఉదయం వేళ రాహుల్ లోక్‌సభకు వెళుతుండగా ఒక మైనర్ యాక్సిడెంట్ జరిగింది.

 Rahul Gandhi's Heart Is Gold See How He Helped A Downtrodden Person, Congress Le-TeluguStop.com

ప్రమాద బాధితుడికి సహాయం చేయడానికి తన కాన్వాయ్‌ను రాహుల్ ఆపేశారు.అంతేకాదు, కింద పడిపోయిన ఆ వ్యక్తి దగ్గరికి వెళ్లి మరీ సహాయం చేశారు.

అవిశ్వాస తీర్మానంపై చర్చలు ప్రారంభమయ్యే కొద్ది క్షణాల ముందు ఈ ఘటన జరిగింది.గాంధీ 10 జన్‌పథ్( Gandhi 10 Janpath ) నుంచి పార్లమెంటుకు ప్రయాణిస్తుండగా, మార్గం మధ్యలో స్కూటర్ రైడర్‌ ప్రమాదవశాత్తు కింద పడిపోయాడు.ఇది గమనించిన రాహుల్ గాంధీ వెంటనే తన భద్రతా సిబ్బందిని కాన్వాయ్‌ని ఆపమని ఆదేశించారు.గాయపడిన బాధితుడి వద్దకు వెళ్లి వారి యోగక్షేమాలు అడిగారు.కిందపడిన స్కూటర్ లేపి అతనికి సహాయం అందించారు.ఆపై ఏదైనా గాయాలు అయ్యాయా, ప్రమాదం ఎలా జరిగింది? వంటి వివరాలను అడిగి తెలుసుకున్నారు.వెళ్ళేటప్పుడు డ్రైవ్‌ సేఫ్లీ అంటూ బాధితుడికి షేక్ హ్యాండ్ ఇచ్చి మరీ వెళ్లారు.

గాంధీ చేసిన ఈ మంచి పనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.చాలా మంది ప్రజలు అతని సొంత షెడ్యూల్, రాజకీయ విషయాల కంటే బాధలో ఉన్న వ్యక్తికే ప్రాధాన్యత ఇచ్చినందుకు బాగా పొగిడారు.అయితే, ప్రతి పనిలోనూ చెడు చూసే విమర్శకులు ఎప్పుడూ ఉంటేనే ఉంటారు.

వారు ఈ ఘటనను కూడా ఫేక్ పబ్లిక్ స్టెంట్ అని కొట్టి పారేశారు.ఇది ప్రచార ప్రయోజనాల కోసం చేసి ఉండవచ్చని కామెంట్లు చేశారు.

వారి ఉద్దేశ్యాలతో సంబంధం లేకుండా, రాజకీయ నాయకులు తాము ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యక్తుల పట్ల సానుభూతి, శ్రద్ధతో ఉండగలరని గాంధీ చేసిన ఈ పని ప్రతి ఒక్కరికి గుర్తుచేస్తుంది.ఇతరుల జీవితాల్లో మార్పు తీసుకురావడానికి ఇలాంటి చిన్నపాటి చర్యలు చేస్తే చాలని మరోసారి గుర్తు చేస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube