పాలేరులో పోటీ .. ఏపీలో ప్రచారం !  కాంగ్రెస్ లో విలయనానికి షర్మిల ఓకే

వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల( Sharmila )కు పెద్ద చిక్కే వచ్చి పడింది.ఒంటరిగా పార్టీని బలోపేతం చేసి తెలంగాణ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు సాధించి అధికారంలోకి రావాలనే పట్టుదలతో పార్టీని స్థాపించినా , అప్పట్లో చేరికలు కనిపించినా, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు.

 Competition In Paleru .. Campaign In Ap ! Sharmila Is Ok To Merge In Congress ,y-TeluguStop.com

పార్టీలోకి చేరికలు పూర్తిగా నిలిచిపోయాయి .మీడియాలో ఫోకస్ కూడా బాగా తగ్గింది.దీంతో షర్మిల ప్రజాప్రస్థానం పేరుతో పాదయాత్ర చేపట్టినా,  పార్టీ తరఫున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించినా స్పందన అంతంత మాత్రమే అన్నట్టుగా ఉండడం తో  ఇక ఒంటరి ప్రయాణం సాధ్యం కాదని భావించిన షర్మిల కాంగ్రెస్ వైపు ఆసక్తి చూపిస్తున్నారు.ఆ పార్టీతో పొత్తు పెట్టుకోవాలని షర్మిల ప్రయత్నిస్తున్న , కాంగ్రెస్ అధిష్టానం మాత్రం పొత్తు ప్రతిపాదన లేదని, పార్టీని విలీనం చేయాలనే షరతులు విధించారు.

ఇక తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వంటి వారు షర్మిల రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.అసలు ఆమె అవసరం లేదని , ఆమెను తెలంగాణ రాజకీయాల కంటే , ఏపీ రాజకీయాలకి పరిమితం చేయాలనే ప్రతిపాదనను రేవంత్ తెచ్చారు.

Telugu Aicc, Ap Congress, Congress, Dk Siva Kumar, Komati Venkata, Pcc, Revanth

ఇక కాంగ్రెస్ అధిష్టానం కూడా తెలంగాణ కాంగ్రెస్ లో షర్మిల అవసరం పెద్దగా లేదని,  ఏపీ కాంగ్రెస్( Congress party ) కు అధ్యక్షురాలిగా నియమిస్తామని చెప్పినా, షర్మిల మాత్రం ఆ షరతులకు అంగీకరించడం లేదు.ఇక తెలంగాణ కాంగ్రెస్ లో కీలక నేత వైఎస్ కుటుంబం కి అత్యంత సన్నిహితుడుగా పేరుపొందిన భువనగిరి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి,  కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివ కుమార్ వద్ద షర్మిల లాబీయింగ్ చేశారు.ఇక ఏపీ రాజకీయాలలో తాను ఉండనని , తెలంగాణ రాజకీయాల్లోనే ఉంటానని షర్మిల క్లారిటీ ఇచ్చారు.దీంతో కాంగ్రెస్ హై కమాండ్ షర్మిల విషయాన్ని పక్కన పెట్టింది.

Telugu Aicc, Ap Congress, Congress, Dk Siva Kumar, Komati Venkata, Pcc, Revanth

అయితే ఇప్పుడు షర్మిల మరో ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు.వచ్చే తెలంగాణ ఎన్నికల్లో పాలేరు అసెంబ్లీ నుంచి పోటీ చేస్తానని,  అవసరమైతే ఏపీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున ప్రచారం చేస్తానని చెప్పగా , కాంగ్రెస్ అధిష్టానం విలీనానికి అంగీకరించినట్లు సమాచారం.గత వారం రోజులుగా షర్మిల ఢిల్లీలోనే మకాం వేశారు.ఈనెల 12వ తేదీన కాంగ్రెస్ ల్లో వైఎస్సార్ తెలంగాణ పార్టీని విలీనం చేసేందుకు ముహూర్తం కూడా పెట్టుకున్నట్లు సమాచారం.

పాలేరు అసెంబ్లీ నియోజకవర్గంలో తాను పోటీకి దిగినా, తమ కుటుంబానికి సన్నిహితుడైన ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి( Ponguleti Srinivas Reddy ) తన అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకరించరని ,  తన గెలుపునకు కృషి చేస్తారని నమ్మకం పెట్టుకున్నారు.అందుకే కాంగ్రెస్ హై కమాండ్ విధించిన షరతులకు అంగీకరిస్తూనే పాలేరు నుంచి తన సీటును కన్ఫర్మ్ చేసుకున్నట్లు సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube