రణ్ బీర్ కపూర్ ని పెళ్లి చేసుకున్న 3 రోజులకే మళ్ళీ పెళ్లి చేసుకున్న అలియా భట్.. ఎవరినో తెలుసా..?

రణ్ బీర్ కపూర్ అలియా భట్ (Ranbeer kapoor-Alia bhatt) లు ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.అయితే వీరి పెళ్లి కంటే ముందే రణ్ బీర్ కపూర్ కి చాలామంది హీరోయిన్లతో ఎఫైర్స్ ఉండేవి.

 Alia Bhatt Got Married Again 3 Days After Marrying Ranbir Kapoor Details, Alia B-TeluguStop.com

అలాగే అలియా భట్ కూడా రణ్ బీర్ కపూర్ కంటే ముందే కొంతమంది హీరోలతో లవ్ ట్రాక్ నడిపించింది.

అయితే ఇవి సినిమా ఇండస్ట్రీలో చాలా కామన్ ఎవరూ కూడా పెళ్ళికి ముందు ఉన్న ఎఫైర్స్ ని పట్టించుకోరు.

అయితే ఎంతో ప్రేమించుకొని రణ్ బీర్ కపూర్ అలియా భట్ (Alia bhatt) ఇద్దరు ఇంట్లో వాళ్ళని ఒప్పించి 2022 ఏప్రిల్ 14న అంగరంగ వైభవంగా తమ వివాహం చేసుకున్నారు.ఇక వీరి వివాహానికి చాలామంది బంధువులు, సన్నిహితులు, ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు, రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు ఇలా చాలామంది హాజరయ్యారు.

Telugu Alia Bhatt, Karan Johar, Marraige, Ranbeer Kapoor, Rockyaur-Movie

ఇక అలియా భట్ బాలీవుడ్ నటి అయినప్పటికీ తెలుగు ప్రేక్షకులకు కూడా ఆర్ఆర్ఆర్ (RRR) సినిమా ద్వారా సుపరిచితమైంది.అయితే అలియా భట్ మూడు రోజుల తేడాతో రెండుసార్లు పెళ్లి చేసుకుంది అంటూ బాలీవుడ్ ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ (Karan Johar) ఓ ఇంటర్వ్యూ లో సీక్రెట్ ని బయటపెట్టారు.అయితే ఈ విషయం తెలిసిన చాలా మంది నెటిజన్స్ రణ్ బీర్ కపూర్ ని పెళ్లి చేసుకున్నాక మళ్లీ రెండో పెళ్లి అలియాభట్ ఎవరిని చేసుకుంది అంటూ అనుమాన పడుతున్నారు.అయితే అలియా భట్ (Alia bhatt) రెండోసారి పెళ్లి చేసుకుంది ఎవరినో కాదు మళ్ళీ తన భర్త రణ్ బీర్ కపూర్ నే.

Telugu Alia Bhatt, Karan Johar, Marraige, Ranbeer Kapoor, Rockyaur-Movie

ఇక అసలు విషయం ఏమిటంటే.అలియా భట్ రణ్ బీర్ కపూర్ ల పెళ్లయిన తర్వాత మూడు రోజులకే రణ్ బీర్ ఆలియా కలిసి నటించిన రాఖీ ఔర్ రాణికీ ప్రేమ్ కహాని (Rocky Aur Rani Ki Prem Kahani) అనే సినిమాలో నటించారు.అయితే ఈ సినిమా షూటింగ్లో భాగంగా వీరి పెళ్లయిన వారంలోపే మళ్ళీ అలియాభట్ మెడలో రణ్ బీర్ కపూర్ తాళి కట్టే సన్నివేశం ఉంది.ఈ విధంగా పెళ్లైన వారంలోపే వీళ్ళిద్దరూ రెండుసార్లు పెళ్లి చేసుకున్నారు అని ఎవరికి తెలియని ఒక ఆసక్తికరమైన విషయం గురించి కరణ్ జోహార్ (Karan johar) ఓ ఇంటర్వ్యూలో తెలియజేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube