ప్రతిపక్షాల ఇండియా కూటమిపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.దేశంలో విపక్షాలు నెగటిక్ పాలిటిక్స్ చేస్తున్నాయని మండిపడ్డారు.
అవినీతి, వారసత్వం మరియు బుజ్జగింపు రాజకీయాలు వెళ్లిపోవాలన్న మోదీ క్విట్ ఇండియా ఉద్యమం స్ఫూర్తితో ఇప్పుడు దేశం మొత్తం చెబుతోందని అన్నారు.తాము పని చెయ్యం.
ఇతరులు కూడా చేయకూడదన్నట్లుగా కొన్ని పార్టీల వ్యవహారం ఉందని ఆరోపించారు.అయితే అభివృద్ధి చెందిన దేశంగా మారాలనే లక్ష్యంతో భారత్ అడుగులు వేస్తోందని స్పష్టం చేశారు.