సోషల్ మీడియాలో ఓ వింత సంఘటన మగ మహారాజుల మనోభావాలను దెబ్బతీసేలా ఉందని ఫీల్ అవుతున్న పాపం.ఇది చూసిన నెటిజనులు సైతం ఇదేమి విచిత్రం అంటూ నోరెళ్లబెడుతున్నారు.
ఇలాంటి వింతలు ఈ కలియుగంలో చూస్తామనుకులేదు అంటూ తెగ దిగులు పడిపోతున్నారు.విషయం ఏమిటంటే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న ఈ వీడియో.
ఒక సెలూన్‌లో( Saloon ) ఒక అమ్మాయికి సంబందించినది.అవును, అక్కడ తన ముఖానికి బార్బర్ తో( Barber ) షేవ్ చేయించుకోవడం ఇపుడు మిక్కిలి ఆశ్చర్యాన్ని కలుగజేస్తోంది.
15 సెకన్ల నిడివిగల ఈ క్లిప్ లో సెలూన్‌లో కూర్చున్న అమ్మాయి( Woman ) ముఖం మీద షేవింగ్ క్రీమ్ రాసి… బార్బర్ ఆమెకు షేవింగ్( Shaving ) చేస్తుండడం మనం చాలా స్పష్టంగా చూడవచ్చు.అలా అతను ఆమె గడ్డానికి షేవ్ చేశాడు.అతను పురుషులకు చేసినట్టుగానే ఆమెకి షేవ్ చేయడం అందర్నీ షాక్ కు గురి చేస్తోంది.ఈ క్లిప్‌ను ట్విట్టర్‌లో పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్‌గా మారింది.
దానిని పోస్ట్ చేసినవారు “మార్పు అనేది ప్రకృతి నియమం” అని క్యాప్షన్ లో రాసుకువచ్చారు.ఈ వీడియో చాలా మంది యూజర్స్ ను ఆశ్చర్యానికి గురి చేసింది.
దాంతో చాలామంది నెటిజన్లు ఆ విడియోపైన రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.“మార్పు జరుగుతూనే ఉండాలి” అని కొంతమంది కామెంట్ చేయగా, మరికొంతమంది ఆమె అమ్మాయి కాదేమో అన్నట్టు అనుమానాన్ని వెలిబుచ్చుతున్నారు.కొంతమంది అమ్మాయిలు మాత్రం ఆమెకు సపోర్ట్ చేస్తున్నారు.రోజూ షేవింగ్ చేయడం చర్మానికి మంచిదని, ఇది ముఖంలోని మృతకణాలు, నూనెలను తొలగిస్తుందని, మేకప్‌ను మరింత సాఫీగా అప్లై చేయడంలో సహాయపడుతుందని కామెంట్స్ చేస్తున్నారు.
దాంతో మరికొంతమంది అమ్మాయిలు ఆ కామెంట్స్ కి మద్దతు ప్రకటిస్తున్నారు.షేవింగ్ చేసుకోవటం ద్వారా ఎలాంటి బ్యాక్టీరియా దరి చేరదు.అదే విధంగా ఎలాంటి హాని చేయదు అని వివరిస్తున్నారు.