టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన చిత్రం బ్రో.సముద్రఖని దర్శకత్వం వహించిన ఈ సినిమా గత నెల 28న విడుదలైన విషయం తెలిసిందే.
భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా మిక్స్డ్ టాక్ ని సొంతం చేసుకుంది.పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ సినిమా మొదటి మూడు రోజుల్లోనే వంద కోట్లకుపైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది.
కాగా బో సినిమాను విజయవంతం చేసినందుకు గాను ఇటీవల చిత్ర బృందం బ్రో విజయ యాత్ర చేసిన సంగతి తెలిసిందే.ఈ యాత్రలో అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
అయితే వారందరికి తాజాగా హీరో సాయి ధరమ్ తేజ్ సోషల్ మీడియా వేదికగా థ్యాంక్స్ చెప్పాడు.
అయితే ఈ యాత్రలో కొంత మంది హెల్మెట్లు పెట్టుకోకుండా బైకులు నడపడం పై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.ఎప్పుడైనా సరే బైక్‌లపై ప్రయాణించేటప్పుడు హెల్మెట్లు తప్పక ధరించాలని ఆయన కోరారు.ఫ్యాన్స్‌ను అభిమానుల్లా తాను చూడనని బ్రోస్ లాగే చూస్తానని చెప్పుకొచ్చారు.
ఈ సందర్భంగా సోషల్ మీడియాలో ట్వీట్ చేస్తూ. బ్రో( Bro movie ) విజయయాత్రలో భాగంగా మీరు నాపై చూపించిన అభిమానానికి చాలా చాలా థ్యాంక్స్.
అందరినీ కలుసుకోవడం, మీ ప్రేమను పొందడం, సినిమా గురించి మీ నుంచి వినడం చాలా బాగుంది.అయితే నన్ను కలవడానికి వచ్చే వారు ఫోటోలు, సెల్ఫీలు అంటూ ఆప్యాయంగా దగ్గరికొస్తున్నారు.
వీలైనంత మేరకు నేను అందరికీ అందుబాటులో ఉండటానికి ప్రయత్నిస్తున్నాను.
ఈ క్రమంలోనే చాలా మంది హెల్మెట్ ధరించకుండా బైకుల మీద ఫాలో చేయడం, డ్రైవింగ్ చేస్తూ సెల్పీలు, వీడియోలు తీసుకోవడం వంటివి చేస్తున్నారు.ఈ విషయం నాకు ఎంతో భయాన్ని కలిగిస్తోంది.మీ అభిమానంతో ఇలా చేస్తున్నప్పటికీ ఆ క్రమంలో మీకు ఎటువంటి హానీ జరిగిన నాకు తీవ్ర మనస్థాపన కలిగిస్తుంది.
ఎందుకంటే మిమ్మల్ని అభిమానుల్లా కన్నా బ్రోస్‌లా భావిస్తాను.మీ భద్రత నా బాధ్యత.దయచేసి మీరు బైక్ మీద వెళ్ళేటప్పుడు తప్పకుండా హెల్మెట్ ధరించండి.ఎట్టిపరిస్థితుల్లోను దీన్ని మరిచిపోవద్దు.
నాకు మీ ప్రేమని పొందుతూ ఉండే అవకాశాన్ని ఇవ్వండి.అర్థం చేసుకోగలరు అని భావిస్తున్నాను అని సాయిధరమ్ తేజ్ ( Sai dharam tej )తన సోషల్ మీడియా ఖాతాలో రాసుకొచ్చారు.